సూపర్ సక్సెస్ : చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్ 3.. ఆగస్ట్ 23న ల్యాండింగ్

సూపర్ సక్సెస్ : చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్ 3.. ఆగస్ట్ 23న ల్యాండింగ్

చంద్రయాన్ 3 ప్రయోగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.  చంద్రుడి కక్షలోకి చంద్రయాన్-3  ఎంటరైంది. 2023 ఆగస్టు 05 సాయంత్రం 7 గంటలకు భూ కక్ష నుంచి చంద్రుడి కక్షలోకి చంద్రయాన్- 3 ప్రవేశించింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తెలిపింది.  

లూనర్ ఆర్బిట్ ఇనసర్షన్ పక్రియను విజయవంతంగా చేపట్టామని తదుపరి ఆపరేషన్ ను ఆగస్టు6 వ తేదీన రాత్రి 11 గంటలకు చేపడతామని ఇస్రో తెలిపింది. మరో 18 రోజులు చంద్రుడి కక్షలోనే  తిరగనున్న చంద్రయాన్- 3..  ఈ నెల 23 లేదా 24 న చంద్రుడి పైకి ల్యా్ండ్ కానుంది.  

జూలై 14న చంద్రునిపైకి చంద్రయాన్-3 మిషన్ ప్రారంభించిన తర్వాత అంతరిక్ష నౌక కక్ష్య క్రమంగా ఐదు రెట్లు పెరిగింది. అయితే ఆ కక్ష్యను ఆగస్టు 6న తగ్గిస్తామని ఇస్రో వెల్లడించింది.   కాగా 2023 జూలై 14న LVM-3లో చంద్రయాన్- 3 ప్రయోగించింది ఇస్రో.