ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇరు దేశాల పౌరులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. హమాస్ మిలిటెంట్ల దాడులతో ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగింది.
ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల్లో రైటర్స్ వార్తా సంస్థకు చెందిన వీడియో జర్నలిస్టు ఇస్సామ్ అబ్దల్లా మృతిచెందారు. దక్షిణ లెబనాన్‌పై జరిగిన దాడుల్లో ఆరుగురు జర్నలిస్టులు గాయపడ్డారు. ఇజ్రాయిల్ వైపు నుంచి వచ్చిన మిస్సైల్ వల్ల పలువురు జర్నలిస్టులు గాయపడ్డారు.
Also Read : దేవభూమిలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలివే.. లిస్టవుట్ చేసిన మోదీ
అల్ జెజిరా, ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్‌కు చెందిన జర్నలిస్టులు అల్మా అల్ సాహెబ్ ప్రాంతంలో పనిచేస్తున్న సమయంలో మిస్సైల్ అటాక్ జరిగింది. ఇజ్రాయిల్ బోర్డర్ వద్ద ఆ దేశ మిలిటరీతో పాటు లెబనీస్ మిలిటరీ హిజ్‌బుల్లా కాల్పులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.
