వర్క్ ఫ్రమ్ హోమ్తోనే ఎక్కువ లాభాలు

 వర్క్ ఫ్రమ్ హోమ్తోనే ఎక్కువ లాభాలు

కరోనా మహమ్మరితో  ఐటీ ఉద్యోగులకు  వర్క్ ఫ్రమ్ హోమ్  మొదలైంది.  ప్రస్తుతం జనజీవనం సాధారణ పరిస్థితికి రావడంతో కొన్ని కంపెనీలు  వర్క్ ఫ్రం  హోమ్ పద్ధతికి గుడ్ బై చెప్పేశాయి. అయితే మేజర్ కంపెనీలు మాత్రం ఇప్పటికీ  కొనసాగిస్తున్నాయి. ఐటీ  ఉద్యోగుల  వర్క్ ఫ్రమ్  హోమ్ తో... మేనేజ్ మెంట్స్ కే  కాదు... ఉద్యోగులకీ  ఉపయోగకరంగా ఉండటంతో ఇదే బెటర్  అన్న ఆలోచనలో  ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇంటి నుంచి పనికి ఓకే చెబుతున్న కంపెనీలు

ఒమిక్రాన్ కంటే ముందు ఐటీ ఉద్యోగులకు హైబ్రిడ్ సిస్టమ్ ...కొన్ని రోజులు ఆఫీస్... మరికొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ విధానం కొనసాగాయి.  కొన్ని కంపేనీలు మాత్రం హైబ్రిడ్ కి చెక్ చెప్పి... వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రియార్టీ ఇచ్చాయి. టెక్, బిజినెస్, ప్రొడక్షన్, టెక్నాలజీ లాంటి రోల్స్ లో పనిచేసే ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయడానికి అనుమతి ఇచ్చాయి. మేజర్ కంపెనీలు అనేక విభాగాల్లోని ఉద్యోగులను ఈ ఏడాది కూడా ఇంటి నుంచే పని చేయించాలని నిర్ణయించాయి. 

వర్క్ ఫ్రం హోంతో పెరిగిన కంపెనీల బిజినెస్

వారంలో ఐదు వర్కింగ్ డేస్ లో ఒకట్రెండు రోజులు ఆఫీసులో పని చేసి.. మిగతా రోజులు ఇంటి నుంచి చేయమని ఆప్షన్స్ ఇస్తున్నాయి. కరోనా భయం తగ్గిన తర్వాత చాలా కంపెనీల బిజినెస్ బాగా పెరిగింది. గతంలో గ్రామీణ ప్రాంతాలు, టైర్ 2, 3 టౌన్స్ లో ఇంటర్నెట్ కనెక్టివిటీ పెద్ద సమస్యగా ఉండేది. కానీ ఇప్పుడు మారుమూల పల్లెల్లోనూ ఇబ్బందుల్లేవు. ఇళ్లల్లోనూ ఆఫీసు సెటప్ క్రియేట్ చేసుకునేందుకు చాలా కంపెనీలు ఉద్యోగులకు ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి. దాంతో ఎంప్లాయీస్ ఇళ్ళ నుంచి పనికే ప్రాధాన్యత ఇస్తున్నారని తెలంగాణ ఇన్మర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ అధ్యక్షుడు సందీప్ మక్తలా తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఉద్యోగులకు కోవర్కింగ్ ప్లేస్ ని క్రియేట్ చేయడంపై కంపెనీలు ఆలోచిస్తున్నాయి. దాంతో అక్కడ కూడా ఐటీ ఎంప్లాయిస్ వర్కింగ్ కల్చర్ మారే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. 

వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల తగ్గిన ఖర్చులు.. పెరిగిన లాభాలు

వర్క్ ఫ్రమ్ హోమ్ తోనే ఎక్కువ లాభాలున్నయన్నాయని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ విశ్లేషించింది.  కంపెనీలకు ఆఫీసుల్లో ఇన్ఫ్రా స్ట్రక్చర్  కాస్ట్ తో పాటు సపోర్ట్ స్టాఫ్ ఖర్చులు బాగా తగ్గాయి.  ఉద్యోగులు వర్క్ ప్రెజర్ ఎక్కువైందని అంటున్నా... ఇండ్లలో మల్టిపుల్ వర్క్ చేసుకోడానికి అవకాశం ఏర్పడిందని చెబుతున్నారు. నగరంలో అద్దెలు, ఇతర ఖర్చులు... దూరప్రాంతాల నుంచి ఆఫీసులకి రావడానికి ట్రాఫిక్ కష్టాలు... గంటల తరబడి సమయం వృధా.. పెట్రోల్ ఆదా అవుతున్నాయని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియోషన్ ప్రెసిడెంట్ సందీప్ మక్తలా చెబుతున్నారు. 

ఐటీ కంపెనీల ఎంప్లాయిస్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటుగా మారింది. వర్చువల్ టూల్స్ చాలా అందుబాటులోకి రావడంతో ఐటీ ఉద్యోగులకు భవిష్యత్తు అంతా వర్క్ ఫ్రమ్ హోమే ఆప్షన్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.