పిలిచి అవమానిస్తారా?. మోడీ ముందే మమత ఆగ్రహం

పిలిచి అవమానిస్తారా?. మోడీ ముందే మమత ఆగ్రహం

ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్న కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ సీరియస్ అయ్యారు. మమత  మాట్లాడుతున్న టైంలో.. వ్యతిరేక నినాదాలు రావడంతో… తనను ఆహ్వానించి అవమానించొద్దని దీదీ అన్నారు. నిరసన తెలిపిన వారికి డిగ్నిటీ లేదని.. ఏమీ మాట్లాడకుండానే ముగించారు మమతబెనర్జీ.

విక్టోరియా మెమోరియల్ వేదికగా జరిగిన నేతాజీ 125 సుభాష్ చంద్రబోస్ జయంత్యుత్సవ కార్యక్రమానికి ప్రధాని మోడీ, బెంగాల్ సీఎం మమతా,గవర్నర్ ధన్ కర్ పాల్గొన్నారు.మమతా మాట్లాడే సమయంలో మోడీకి  కొందరు జైశ్రీరామ్ అనే నినాదాలు చేశారు. దీంతో ఓకింత మమత అసహనం వ్యక్తం చేశారు. తనను పిలిచి అవమనించం సరికాదన్నారు. నిరసన తెలిపిన వారికి డిగ్నిటీ లేదన్నారు. ఇదేమి పొలిటికల్ ప్రోగ్రాం కాదని..ప్రభుత్వ ప్రొగ్రామని సీరియస్ అయ్యారు. తనకు అవమానం జరిగిందని..తానేమి మాట్లాడనని ముగించారు.