ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ స్కాంలో అక్రమ సంపాదనకు సంబంధించి రంగంలోకి దిగింది ఐటీ. ఇందుకు సంబంధించి పలువురు నిందితులకు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఈ స్కాం ద్వారా సుమారు రూ. 2వేల కోట్లు అక్రమ సంపాదనపై ఫోకస్ పెట్టింది ఐటీ. రూ. 2వేల కోట్లకు సంబంధించి ట్యాక్స్ వివరాలు సేకరించే పనిలో ఉన్నారు ఐటీ అధికారులు. లిక్కర్ స్కాం ద్వారా వచ్చిన అక్రమ సంపాదనను ఒక చోటు నుంచి మరో చోటుకు హవాలా మార్గంలో తరలించినట్లు అనుమానిస్తున్నారు అధికారులు.
ఈ స్కాం ద్వారా నెలకు రూ.50 నుంచి 60 కోట్ల వరకు అక్రమ నగదు జెనరేట్ చేసినట్లు దర్యాప్తులో బయటపడింది.హవాలా ద్వారా లిక్కర్ స్కాం సొమ్మును దుబాయ్ కు తరలించినట్లు గుర్తించినట్లు తెలిపారు అధికారులు. డిస్టిలరీల నుంచి వెండర్లకు ఐదు రెట్లు ఎక్కువ చెల్లింపులు చేసినట్లు గుర్తించారు అధికారులు.
ఎలాంటి మెటీరియల్ సరఫరా చేయకుండా.. రెండు డిస్టిలరీలు ఫేక్ ఇన్‌వాయిస్‌లు సృష్టించి రూ.76.92 కోట్ల రూపాయలను తరలించినట్లు దర్యాప్తులో తేలింది.డిజిటల్ ట్రైల్‌ను తప్పించుకునేందుకే మొత్తం లాభాలను బ్లాక్ మనీగా దాచిపెట్టినట్లు గుర్తించామని తెలిపారు ఐటీ అధికారులు.
