మూడో టెస్టులో టాస్ ఓడిపోవడం మాకు కలిసొచ్చింది

మూడో టెస్టులో టాస్ ఓడిపోవడం మాకు కలిసొచ్చింది

మూడో టెస్ట్ లో టీమిండియాకు పాఠాలు చెబుతున్నాడు ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్. రెండు టెస్టుల్లో ఓడిపోయిన విషయాన్ని మర్చిపోయి.. మూడో టెస్ట్ లో గెలిచిన తర్వాత చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.. భారత్ ను భారత్ లోనే ఓడిస్తే వచ్చే కిక్కే వేరు.. ఆ మజానే వేరు అంటూ కామెంట్స్ చేశారు స్టీవ్ స్మిత్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ లో జరిగిన  మూడో టెస్ట్‌లో ఆసీస్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది భారత్. 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. జట్టు మొత్తం సమిష్టిగా రాణించటంతో ఇండియా ఓటమి సాధ్యం అయ్యిందన్నారు. మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడం.. ఫస్ట్ డేనే..  ఆసీస్ బౌలర్లు రాణించటంతో.. ఇండియాను ఓడించటం జరిగిందన్నారు స్మిత్. ఇదే జోరును చివరి మ్యాచ్‌లోనూ కొనసాగించి సిరీస్‌ను సమం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

భారత్ లో కెప్టెన్సీ చేయడం తనకు ఆనందాన్నిచ్చిందని, తన కెప్టెన్సీలో ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ గెలిచినందుకు గర్విస్తున్నానని స్మిత్ అన్నాడు. ఈ విజయం మా ప్లేయర్లకు అంకితమని, అందరు సమిష్టి కృషితో మ్యాచ్ ను గెలిపించారని స్మిత్ అన్నాడు.