రూల్స్​తో నవ్వించే మనో రంజన్

రూల్స్​తో నవ్వించే మనో రంజన్

కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి జంటగా ‘ఆక్సిజన్’ ఫేమ్ రత్నం కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూల్స్ రంజన్’. సెప్టెంబర్ 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌లో హీరో  కిరణ్ మాట్లాడుతూ ‘కథ వింటూ నేనెంతలా నవ్వానో, సినిమా చూస్తూ ప్రేక్షకులు కూడా అంతే నవ్వుతారని నమ్ముతున్నా. ఇందులో నేను పోషించిన మనో రంజన్ పాత్రకు చాలామంది కనెక్ట్ అవుతారు. రత్నం గారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన మా సినిమాకు సమర్పకుడిగా ఉండటం గర్వంగా ఉంది. మంచి పాటలు ఇచ్చిన అమ్రిషికి థ్యాంక్స్’ అని చెప్పాడు. ‘డీజే టిల్లు’లో రాధిక పాత్ర తరహాలో ఇందులో నేను పోషించిన సనా పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నాను’ అని చెప్పింది నేహాశెట్టి. 

చిత్ర సమర్పకులు ఏ.ఎం.రత్నం మాట్లాడుతూ ‘పాటలు హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్లే. ఈ సినిమాకు అది వర్తిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా చూశా. కుటుంబమంతా కలిసి చూడగలిగేలా ఉన్న ఈ చిత్రం ఖచ్చితంగా విజయం   సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఓ మంచి ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్ తీయాలని దీన్ని స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేశాం. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. అప్పటికే నాలుగైదు చేతిలో ఉన్నా మా కథ నచ్చడంతో ఒప్పుకున్నారు కిరణ్. నా స్నేహితులే ఈ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉంది’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాతలు దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి, సంగీత దర్శకుడు అమ్రిష్ గణేష్  తదితరులు పాల్గొన్నారు.