వికారాబాద్ లో వింత వ్యాధికి కారణం కల్తీకల్లే..

వికారాబాద్ లో వింత వ్యాధికి కారణం కల్తీకల్లే..

వికారాబాద్ లో వారం రోజుల క్రితం దాదాపు 150 మంది అస్వస్థకు గురవ్వడానికి కారణం కల్లీ కల్లే అని నిర్ధారణ అయ్యింది. పిచ్చోల్లకు ఇచ్చే డ్రగ్ ను కల్లులో కలిపినట్టు రుజువైంది. కల్తీకల్లు వల్ల ఇప్పటి వరకు ఇద్దరు చనిపోయారు.  వికారాబాద్​మండలం ఎర్రవల్లి, కొత్తగడి, చింతన్​బోడ, నారాయణపూర్​, పెండ్లిమడుగు, పులుమద్ది, నవాబుపేట మండలం మమదాన్​పల్లి, ఎక్​మామిడి, వట్టిమీనేపల్లి, చిట్టిగిద్ద, ఆర్కతల పంచాయతీల పరిధిలో 150 మంది వరకు వింత రోగ లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. ప్రధానంగా గ్రామస్తుల్లో  కళ్లు తిరిగి పడిపోవడం, నోటి నుంచి నురగ రావడం, పళ్లు కొరుక్కోవడం, కాళ్లు, చేతులు కొట్టుకోవడం వంటి లక్షణాలతో బాధ పడుతున్నారు. వారి నుంచి శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్ కు పంపగా..కల్లీ కల్లు వల్లే వారు అస్వస్థకు గురయ్యారని ఇవాళ రిపోర్ట్ వచ్చింది.

see more news

భయపడొద్దు.. టీకా వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవ్

మోడీ నోట తెలుగు పద్యం.. వ్యాక్సిన్ ప్రారంభించిన ప్రధాని