హైదరాబాద్లో ఆగని వాన

హైదరాబాద్లో ఆగని వాన

శుక్రవారం మొదలైన వాన శనివారం కూడా కొనసాగింది. ఉదయం నుంచి ముసురుతో పాటు అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది.  వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద మోకాలి లోతు నీరు ఉండటంతో చాలా ఏరియాల్లో ట్రాఫిక్​ జామ్​తో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. శనివారం మేయర్ గద్వాల్ విజయలక్షి పలు ప్రాంతాల్లో పర్యటించారు. బల్దియా హెడ్డాఫీసులో ఏర్పాటు చేసిన కంట్రోల్​రూమ్​ను పరిశీలించారు. మాన్​సూన్, డీఆర్ఎఫ్ టీమ్స్​ను అలర్ట్ చేశామని మేయర్ తెలిపారు. మొబైల్, మినీ మొబైల్ వెహికల్స్ ను ఏర్పాటు చేశామన్నారు. ఎమర్జెన్సీ ఉంటే 040--21111111 లేదా 040-29555500 నంబర్లకు కాల్ చేయాలన్నారు.  మేడ్చల్ జిల్లా కలెక్టరేట్​లోనూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హరీశ్​ తెలిపారు. సమస్యలున్న వారు 8418297820, 9492409781 నంబర్లకు  కాల్  చేయాలన్నారు.  వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలోనూ ముసురు కొనసాగుతోంది. రాత్రి 8 గంటలకు షాద్​నగర్ బస్ డిపో గ్యారేజ్ ఎంట్రెన్స్​ వద్ద ఉన్న  ఓ చెట్టు   కూలిపోయింది. మరో రెండ్రోజులు వానలుంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

- వెలుగు, హైదరాబాద్/ కీసర/షాద్ నగర్


రాత్రి 12 గంటల వరకు గ్రేటర్​లో నమోదైన వర్షపాతం
ఏరియా                                వర్షం (సెం.మీలలో)
హఫీజ్ పేట​                         5.6
మాదాపూర్                           4.7
మైలార్​ దేవ్ పల్లి                 4.3
రామంతాపూర్​                     4.1
బాలానగర్​​                           3.8