పన్నుఎగవేత దారులకు రాజ్యసభ ఇవ్వడం సిగ్గుచేటు

పన్నుఎగవేత దారులకు రాజ్యసభ ఇవ్వడం సిగ్గుచేటు
  • మున్ముందు టీఆర్ఎస్లో ఉద్యమకారులకు చోటు లేదు
  • తెలంగాణవాదులకు అవకాశం లేదు
  • సామాన్యులకు కనీస పాత్ర కూడా ఉండదు
  • బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

హైదరాబాద్: టీఆర్ఎస్ లో ఉద్యమకారులకు చోటు లేదన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. పన్ను ఎగవేతదారులకు రాజ్యసభ సీటు కేటాయించటం సిగ్గుచేటన్నారు. సీట్ల కేటాయింపు వ్యవహారం టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ చెప్పక తప్పడం లేదన్నారు. మున్ముందు టీఆర్ఎస్ లో ఉద్యమకారులకు స్థానం లేదని.. తెలంగాణ వాదులకు అవకాశం లేదని.. సామాన్యులకు కనీస పాత్ర కూడా ఉండదని అభ్యర్థుల ప్రకటనతో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. 
ఆర్ధిక నేరస్తులకు, పన్ను ఎగవేత దారులకు పెద్దపీట వేసి అభ్యర్థులుగా ప్రకటించడం శోచనీయం అన్నారు. ఏపీలో సీఎం జగన్ ప్రకటించిన అభ్యర్థిత్వాలను పరిశీలిస్తే తన సోదరి షర్మిల కోసమే జగన్ ఇక్కడి వారికి రాజ్యసభ సీటు కేటాయించారని అర్థమవుతుందని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని ఆయన చెప్పారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా పేదలకు కేంద్రం ఉపాధి చూపిస్తుందని పేర్కొన్నారు. 

 

 

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో ట్రోలింగ్‌‌పై తెలుగు ఫిలిం ఛాంబర్ గరంగరం

సినిమాలపై ట్రోలింగ్ ఎక్కువైంది