వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ పాలన అంతమవడం ఖాయం

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ పాలన అంతమవడం ఖాయం

బీజేపీ మీటింగ్ జరుగుతుంటే, 8వ నిజాం కేసీఆర్… అసదుద్దీన్ తో గ్రేటర్ ఎన్నికల పై చర్చిస్తున్నారన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. GHMC ఎన్నికలు అమరవీరుల ఆత్మశాంతి కి సంబంధించిన ఎన్నికలన్నారు. 5 ఏళ్ళు పాలించి హైదరాబాద్ ను అన్నిరకాలుగా వరదల్లో ముంచారన్నారు. పాతబస్తీకి అన్యాయం చేస్తుందే కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ కు ఎందుకు ఓటేయాలి…. MMTS కి నిధులు ఇవ్వనందుకా.. ఉస్మానియా ఆస్పత్రికి తాళం వేసినందుకా.. మెట్రో రైల్ ను పాతబస్తీకి తీసుకుపోనందుకా అని ప్రశ్నించారు.

వర్షాలు కారణంగా 6 లక్షల మందిని రోడ్డున పడేసిన చరిత్ర కేసీఆర్ దన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వర్షాలతో 40 మంది చనిపోయారు ఆ బాధ్యత కేసీఆర్ ది కాదా అని అన్నారు. కరోనా సహాయం కేంద్రం ఏమి చేసిందో, రాష్ట్రం ఏమి చేసిందో చర్చకు ప్రగతి భవన్ కు రావడానికి బీజేపీ అధ్యక్షుడు సంజయ్ ఇతర నేతలు సిద్ధంగా ఉన్నారన్నారు. గ్రేటర్ లోని ఏ చౌరస్తా లో నైనా..గాంధీ ఆస్పత్రి, నువ్వు తాళం వేసిన ఉస్మానియా హాస్పిటల్ లో ఎక్కడైనా తాము చర్చకు సిద్ధమన్నారు.

ఓల్డ్ సిటీ ఒవైసీ కుటుంబం.. న్యూ సిటీని కల్వకుంట్ల కుటుంబం పంచుకుందన్నారు కిషన్ రెడ్డి. హైటెక్ సిటీ, రియల్ ఎస్టేట్ ప్రాంతాల్లో మాత్రమే రోడ్లు వేస్తున్నారు..మిగతా ప్రాంతాల్లో ప్రజలు ప్రజలు కాదా అని ప్రశ్నించారు. గత మున్సిపల్ ఎన్నికల్లో డబల్ బెడ్రూం ఇళ్ల ఆశ చూపి TRS గెలిచిందని…ఇప్పుడు ఓట్ల కోసం వస్తే వాళ్ళను నిలదీయాలని సూచించారు. దేశ వ్యాప్తంగా కుటుంబ పాలన అంతమవుతోందని…వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ పాలన పోవడం కూడా ఖాయమన్నారు. అంతేకాదు బీజేపీ గెలవడం కూడా అంతే నిజమన్నారు.దుబ్బాక మొదటి అడుగు, GHMC ఎన్నికలు రెండో అడుగు అని తెలిపారు.

అక్రమ పొత్తుతో బీజేపీ ని ఓడించాలని టీఆర్ఎస్ చూస్తోందని…ఆ ప్రయత్నాలను ప్రజలు తరిమి కొట్టి…మేయర్ పీఠం మీద బీజేపీ కార్యకర్తను కూర్చోబెట్టాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా గెలిచేది బీజేపీ నేనని తేల్చిచెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.