విపక్షాలకు అభ్యర్థులు దొరకడం కష్టం.. మాకు ఒక్కో సీటుకు 8 మంది

విపక్షాలకు అభ్యర్థులు దొరకడం కష్టం.. మాకు ఒక్కో సీటుకు 8 మంది

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో విపక్షాలకు అభ్యర్థులు దొరకడం కష్టంగా మారిందని.. తమకు ఒక్కో సీటుకు 8 మంది పోటీ పడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదర్శ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జరిగిన సమావేశంలో గ్రేటర్ ఎన్నికలపై  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. రెండు జాతీయ పార్టీలకు నా సూచన.. మీరు బలంగా ఉంటే వేరే పార్టీల నాయకులకు ఎందుకు టికెట్లు ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రెండు పార్టీలకు 75 స్థానాల కంటే మించి అభ్యర్థులు దొరకరు. వీరిలో కూడా 15 మంది మాత్రమే బలవంతులు ఉంటారు…. మిగతా వాళ్లు మొత్తం ఏదో నిలబెట్టాలి కాబట్టి అభ్యర్థులను నిలబెడతారని ఆయన పేర్కొన్నారు. మా కారు నిండి పోయింది.. అందుకే ఆ పార్టీ లోకి వెళుతున్నారు.. మేం 150 సీట్లలో పోటీ చేస్తున్నాము.. 104 సీట్లు గెలుస్తాము… మాకు కాంగ్రెస్ తోనే పోటీ ఉంటుందని మంత్రి తలసాని చెప్పారు.  హైదరాబాద్ కు భూపేంద్ర యాదవ్, మాణిక్యం ఠాకూర్  వచ్చినట్టు మాకు కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంచార్జ్ లుగా ఉంటారని మంత్రి తలసాని వివరించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము… స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఎప్పుడు జరగనంత అభివృద్ధి జరిగింది..  24 గంటల కరెంట్, కేసీఆర్ కిట్, బస్తి దవాఖాన, వైకుంఠ ధామం,  ఫుట్ ఫాత్ లు అభివృద్ధి చేసామని గుర్తు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలు.. వరదల గురించి ప్రస్తావిస్తూ.. చరిత్రలో 108 సంవత్సరాల తరువాత భారీ  వరద మన రాష్ట్రానికి  వచ్చిందన్నారు.  పక్క రాష్ట్రాలు స్పందించినంత వేగంగా కూడా  కేంద్రం స్పందించలేదు…  నెల రోజుల తరువాత కేంద్ర బృందాలు వచ్చినా మనకు దమ్మిడీ కూడా ఇవ్వలేదని మంత్రి తలసాని ఆరోపించారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ నష్ట పరిహారం ఇస్తున్నాము. వరదలు వచ్చినప్పుడు మేము బాధితులకు అండగా నిలపడ్డాము. 10 వేల రూపాయలు ఇచ్చాము.. మొదట్లో 4 లక్షల 75 వేల మందికి డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చాము. తరువాత మీ సేవ లో అప్లయ్ చేసుకోవాలని చెప్పాము. కానీ కొన్ని బోగస్ పార్టీలు డబ్బులు ఇవ్వలేక మీసేవలో అప్లయ్ చేసుకోమని చెప్పారు..  మీసేవ లో అప్లయ్ చేసిన లక్ష 65 మందికి కూడా డబ్బులు ఇచ్చామని వివరించారు.

అయితే కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎలక్షన్ కమిషన్ కు కంప్లయింట్ చేశారు… వరద సాయం 10 వేల రూపాయల పంపిణీని ఎలక్షన్ కమిషన్ ఆపేసింది… అందుకే ఎలక్షన్ల తర్వాత వరద సాయం చేస్తామని హామీ ఇచ్చారు. పేదోళ్లకు ఇచ్చే వరద సాయాన్ని  ఆపిన వాళ్లకు పేద వాళ్ల ఉసురు  తగులుతుందని మంత్రి తలసాని శాపనార్థాలు పెట్టారు. మమ్ములను పైసలు ఎవ్వరు అడగలేదు. అయినా మేము ఇచ్చాము..  కొన్ని పార్టీల వారు  రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారు. మీరు కేంద్రం నుండి రాష్ట్రానికి ఏమి చేశారో చెప్పండి…  మేము చేసిన అభివృద్ధి చూపిస్తాము మీరు ఏమి చేశారో చెప్పండని సవాల్ చేశారు. రెండు జాతీయ పార్టీలకు నా సూచన..  మీరు బలంగా ఉంటే వేరే పార్టీల నాయకులకు ఎందుకు టికెట్ లు ఇస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రమంత్రి గా ఎలెక్ట్ అయ్యి రెండేళ్లు కావొస్తుంది.. కనీసం  కోటి రూపాయల పని తీసుకు వచ్చారా చెప్పండని మంత్రి తలసాని ప్రశ్నించారు. బాధ్యత ఉన్న నాయకులము మేము.. దేవుళ్ల మీద ఒట్టు వేసుడు ఎందుకు.. ? కేటీఆర్ ఐటీ మంత్రి అయిన తరువాత దేశంలో అభివృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందన్నారు.  హైదరాబాద్ ను 70వేల కోట్ల తో అభివృద్ధి చేసాము…  కండ్లు లేని కబోదులకు మేము చేసిన అభివృద్ధి కనపడదన్నారు.  ఎల్ ఆర్ ఎస్ (LRS) కు దరఖాస్తు చేసిన వాళ్లంతా అమాయకులు కారు..  ఓల్డ్ సిటీ లో మీ పార్టీ బలం పెంచుకోండి..  ఆలే నరేంద్ర ఓల్డ్ సిటీ లో మీ పార్టీ  బలం పెంచినట్టు మీరు కూడా ఓల్డ్ సిటీ లో మీ బలం పెంచండని మంత్రి తలసాని సూచించారు.

Read more news

మనస్పర్థలతో ఫ్రెండ్స్ మధ్య గ్యాప్.. ఈ గ్యాప్ రావొద్దంటే..

సినిమాల్లోనే విలన్.. రియల్ లైఫ్‌లో మాస్ హీరో

బిచ్చమడిగితే చిల్లరివ్వకుండా ఏకంగా జాబులే ఇప్పించిండు

మొదలైన వింటర్ క్రైసిస్.. పెరుగుతున్న కరోనా కేసులు