
YCP అధ్యక్షుడు YS జగన్‌కు తాము వెయ్యి కోట్ల రూపాయిలు ఇచ్చామనడంలో అర్ధం లేదన్నారుTRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ఏపీ సీఎం చంద్రబాబు… తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఒక బూచిగా చూపుతున్నారని ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రులను బెదిరిస్తున్నారనడం సరైంది కాదన్నారు. పవన్ ఆస్తులు హైదరాబాద్‌లోనే ఉన్నాయని, ఏమైనా ఇబ్బంది పడ్డారా అని కేటీఆర్ ప్రశ్నించారు. TRS 16 లోక్‌సభ స్థానాలు గెలుచుకోవాలనే అంశంపై మాట్లాడిన కేటీఆర్… ఒక్క సీటుతోనే కేంద్ర ప్రభుత్వాలు కూలిపోయాయని, 16 సీట్లు తక్కువా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ విషయంలో వెనక్కు తగ్గలేదని, ముందుకు వెళ్లలేదని ఆయన చెప్పారు.