ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం కరెక్టు కాదు : హరీష్ రావు

ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం కరెక్టు కాదు : హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం కరెక్టు కాదని అన్నారు. వందల మంది పోలీసులతో కలిసి తెల్లవారుజామున మూడు గంటలకు వెళ్లి అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని గత పదేళ్ళలో ఎప్పుడు కక్ష్య పూరితంగా వ్యవహరించలేదని చెప్పారు. 

స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి ఉన్నా కేవలం జైలుకు పంపాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారని  హరీష్ రావు ఆరోపించారు. ఇటువంటి విధానాలు మార్చు కోవాలని సూచించారు. మంత్రి ఆదేశాలతో టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల క్వారీలు మీద ఎటువంటి చర్యలు లేవని తమపై వరుసగా కేసులు నమోదు చేస్తూ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. 

ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తి అయ్యాయి..హామీల అమలు పూర్తి కాలేదని విమర్శించారు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చివరకు ధర్మమే గెలుస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది పనికి రాదని ప్రజల మనసు గెలవండని  హరీష్ రావు సూచించారు.