వాట్సాప్ కాల్స్ రికార్డవడం అవాస్తవం: సీపీ సజ్జనార్

వాట్సాప్ కాల్స్ రికార్డవడం అవాస్తవం: సీపీ సజ్జనార్

బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్, వెలుగు: వాట్సాప్ కాల్స్ రికార్డ్ అవుతాయని, సోషల్ మీడియా కార్యకలాపాలన్నీ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటాయన్న ప్రచారం అవాస్తవమని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు. తెలంగాణ పోలీస్ సైబర్ క్రైం విభాగం పేరుతో చేస్తున్న పోస్టులకు ఎలాంటి అధికారిక ఆధారం లేదన్నారు.

 ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలనే ఉద్దేశంతో కొందరు ఆకతాయిలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పోస్టులను నమ్మొద్దని, ఇతరులకు ఫార్వర్డ్ చేయొద్దని సూచించారు. సోషల్​మీడియా వేదికగా ఫేక్ న్యూస్‌‌‌‌‌‌‌‌ను సృష్టించినా, ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.