యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చడం వెరీ నాచురల్​

యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చడం వెరీ నాచురల్​

యాదాద్రి, వెలుగు: యాదాద్రి పేరును.. యాదగిరిగుట్టగా మార్చడం వెరీ నాచురల్​ అని చినజీయర్​స్వామి అన్నారు. యాదాద్రిగా మీరు నామకరణం చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం యాదగిరిగుట్టగా మార్చిందనే విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ఆయన ఇలా స్పందించారు. యాదాద్రి పేరును రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మార్చకపోయినా.. ప్రభుత్వ కార్యక్రమాలు, పత్రాల్లో యాదగిరిగుట్ట పేరునే వాడుతున్నారు. మంగళవారం యాదాద్రి జిల్లా ఆలేరు మండలం రెడ్డిగూడెంలోని శ్రీకల్యాణ రామచంద్ర స్వామి ఆలయ స్వాగత తోరణాన్ని జీయర్ ఆవిష్కరించారు. అనంతరం రామచంద్రస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.