బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే  పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్‌లోని  ఇల్లు, ఆఫీసుల్లో తెల్లవారుజాము నుంచే తనిఖీలు నిర్వహిస్తున్నారు. శేఖర్ రెడ్డి సిబ్బంది ఇంట్లో కూడా సోదాలు జరుపుతున్నారు. భువనగిరి, హైదరాబాద్‌ కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలానీలోని కార్యాలయాల్లో మొత్తం 12 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ లిమిటెడ్‌లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.  దాదాపు 70 ప్రత్యేక ఐటీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నాయి. వ్యాపార నగదు లావాదేవీలకు సంబంధించి ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి రియల్ ఎస్టేట్‌తో పాటు పలు వ్యాపారులున్నాయి. శ్రీ లార్వెన్స్ సిండికేట్, హిల్ ల్యాండ్ టెక్నాలజీస్‌ కంపెనీలకు పైళ్ల శేఖర్ రెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారు.  ప్రస్తుతం ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి కొత్తపేటలో ఉన్నారు.  ఎమ్మెల్యే  పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు చేయడంతో బీఆర్ఎస్ పార్టీలో టెన్షన్ నెలకొంది.   మిగతా నేతలు కూడా అలర్ట్ అయ్యారు.