స్కూళ్ల ఓపెనింగ్ కు ముందే రెడీగా ఉండాలి

స్కూళ్ల ఓపెనింగ్ కు ముందే  రెడీగా ఉండాలి
  •      యూనిఫామ్ తయారీని పరిశీలించిన రంగారెడ్డి కలెక్టర్ 

ఎల్​బీనగర్,వెలుగు :  ప్రభుత్వ స్కూళ్ల ప్రారంభానికి ముందే యూనిఫామ్ లు రెడీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రంగారెడ్డి కలెక్టర్ శశాంక ఆదేశించారు. మొయినాబాద్ మండలం చిలుకూరులోని మహిళా శక్తి కుట్టు కేంద్రాని శుక్రవారం కలెక్టర్ సందర్శించారు. కేంద్రంలో యూనిఫామ్ తయారీని పరిశీలించారు. ఎన్ని జతలు సిద్ధం చేశారు.

 ఇంకా ఎన్ని కుట్టాల్సి ఉంది,  మెటీరియల్ అందుబాటులో ఉందా అని తదితర వివరాలను అడిగి తెసుకున్నారు. యూనిఫామ్ తయారీకి ప్రగతి నివేదికలను రోజువారీగా అందించాలని అధికారులకు సూచించారు.