తాళి కట్టే సమయంలో అడ్డం తిరిగిన పెళ్లి కొడుకు : లవ్ స్టోరీ ముందే చెప్పాను అంటున్న పెళ్లికూతురు

తాళి కట్టే సమయంలో అడ్డం తిరిగిన పెళ్లి కొడుకు : లవ్ స్టోరీ ముందే చెప్పాను అంటున్న పెళ్లికూతురు

గ్రాండ్ గా పెళ్లి జరుగుతుంది.. డబ్బున్న కుటుంబాలే.. భారీ కళ్యాణ మండపం.. వెయ్యి మంది అతిధులు.. పెళ్లికి ముందు రోజు రిసెప్షన్ కూడా జరిగింది.. తర్వాత రోజు పెళ్లి.. జీలకర్రా బెల్లాం కూడా పెట్టారు.. సరిగ్గా తాళి కట్టే సమయంలో.. తాళి అక్కడ పడేసి.. పెళ్లి పీటలు దిగి వెళ్లిపోయాడు.. అంతా షాక్.. గందరగోళం.. ఇంతకీ అసలు ఏం జరిగింది..  ఎక్కడ జరిగింది. కారణం ఏంటో పూర్తిగా తెలుసుకుందామా..

కర్నాటక రాష్ట్రం దేవనహళ్లిలోని బాలేపుర కళ్యాణ మండపం. పెళ్లి కొడుకు వేణు.. పెళ్లి కూతురు అంజూశ్రీ. పెళ్లి సంబంధం మాట్లాడుకునే సమయంలో.. ఇద్దరూ మాట్లాడుతున్నారు. ఈ సమయంలో పెళ్లి కూతురు అంజూశ్రీ తన గతాన్ని చెప్పింది. నాకు ఓ లవర్ ఉన్నాడు.. అతనితో బ్రేకప్ అయ్యింది.. ఇప్పుడు టచ్ లో కూడా లేడు.. ఈ విషయాన్ని ముందే చెబుతున్నాను.. తర్వాత గొడవలు రావొద్దు అని స్పష్టంగా చెప్పింది. దీనికి పెళ్లికొడుకు వేణు.. అదంతా గతం.. ఇప్పుడు ఎవరూ లేరు కదా.. పెళ్లి ఇష్టమే కదా అని కూడా అడిగాడు.. అంజూశ్రీ ఓకే చెప్పింది.. వేణు కూడా ఓకే అన్నాడు.. అంతా సెట్ అయ్యింది.. పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు.

2025, ఏప్రిల్ 29వ తేదీ రాత్రి దేవనహళ్లిలోని కళ్యాణ మండపంలోనే వేణు, అంజూశ్రీ మ్యారేజ్ రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. ఇద్దరూ ఫొటో షూట్ కూడా చేసుకున్నారు. ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 7 గంటల 30 నిమిషాలకు ముహూర్తం.. పెళ్లి మండపం బంధువులు, అతిధులతో కళకళలాడుతుంది. జీల కర్ర, బెల్లాం కార్యక్రమం ముగిసింది. ఇక తాళి కట్టటమే ఆలస్యం. ఆ ముహూర్తం కూడా వచ్చింది. పురోహితుడు ఇచ్చిన తాళిని తీసుకున్న పెళ్లికొడుకు వేణు.. ఆ తాళిని విసిరికొట్టాడు. నేను ఈ పెళ్లి చేసుకోను.. అంటూ పెళ్లి మంటపం దిగి వెళ్లిపోయాడు. 

పెద్దలు అందరూ పట్టుకుని.. కూర్చోబెట్టి మాట్లాడారు. అంజూశ్రీకి ప్రియుడు ఉన్నాడు.. అతన్ని ఆమె ప్రేమించింది అని చెప్పుకొచ్చాడు. ఇక్కడ అంజూశ్రీ షాక్.. ఈ విషయం ముందే చెప్పాను.. నేనేమీ దాయలేదు.. ఓకే అంటేనే కదా నేను కూడా ఓకే చెప్పింది అంటూ అంజూశ్రీ చెప్పింది. తాళి కట్టటానికి ససేమిరా అన్నాడు వేణు.. పంచాయితీ పోలీసుల దగ్గరకు వెళ్లింది. పోలీసులు కూర్చోబెట్టి మాట్లాడినా.. వేణు మాత్రం నో.. నో అని వెళ్లిపోయాడు. ఈ విషయం పెద్ద సంచలనంగా మారిపోయింది. 

పెళ్లికి ముందే చెప్పిన విషయాన్ని.. అప్పుడు ఓకే అని.. తాళి కట్టే సమయంలో ఇలా అడ్డం తిరగటం ఏంటీ అంటూ పెళ్లి కొడుకుపై, అతని కుటుంబ సభ్యులపై దాడికి దిగారు పెళ్లి కూతురు తరపు వారు. తాంబూలాలు ఇచ్చిపుచ్చుకునే సమయంలో చెప్పొచ్చు.. ఆ తర్వాత చెప్పొచ్చు.. రిసెప్షన్ అప్పుడు చెప్పొచ్చు.. జీలకర్ర బెల్లం సమయంలోనూ చెప్పొచ్చు.. అంతా బాగా చేసుకుని.. చివరలో తాళి కట్టే సమయంలో అడ్డం తిరగటం ఏంటీ.. ఈ విషయాన్ని ఇప్పుడే ఎందుకు బయటపెట్టాడు అంటూ పెళ్లి కూతురు బంధువులు చితక్కొట్టారంట. 

అయినా అంతా ముందే తెలిసి.. చివర్లో పెళ్లి కొడుకు ఇలా చేయటంపై జనంలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతుంది. పెళ్లి కొడుకు తరపు వాళ్లతో న్యాయం చేయాలని.. పెళ్లి కూతురు వాళ్లు డిమాండ్ చేస్తు్న్నారు. ఏదిఏమైనా వీడో సైకోలా ఉన్నాడు అనిపించటంలా అంటున్నారు నెటిజన్లు..