Ajith Kumar: తల అజిత్ బర్త్డే స్పెషల్.. అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు, బైక్ కలెక్షన్స్ ఇవే..

Ajith Kumar: తల అజిత్ బర్త్డే స్పెషల్.. అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు, బైక్ కలెక్షన్స్ ఇవే..

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇండస్ట్రీలో ప్రత్యేక శైలి. సినిమాలు, సామాజిక సేవలతో దేశవ్యాప్తంగా ఆయన అభిమానులను సొంతం చేసుకున్నాడు. అజిత్.. తెలుగు సినిమా ప్రేమపుస్తకంతో(1992) కెరియర్ స్టార్ట్ చేసినప్పటికీ.. తమిళంలో స్టార్ హీరోగా ఖ్యాతి దక్కించుకున్నాడు.

తెలంగాణాలోని సికింద్రాబాద్ (1మే 1971లో) జన్మించిన అజిత్.. నేడు (2025మే1)తో తన 54వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇటీవలే దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్ అందుకున్న తల అజిత్ కు అభిమానులు మరియు సినీ సెలబ్రెటీల నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

హీరో అజిత్కు నటించడంతో పాటు మోటార్ రేసింగ్ అంటే ఎంతో ఇష్టం. అలా అజిత్ కుమార్ రేసింగ్ అనే జట్టును కూడా కలిగి ఉన్నారు. అయితే, అజిత్ దేశంలోనే అత్యుత్తమ డ్రైవర్లలో ఒకడని చాలా తక్కువమందికి తెలుసు. అంతేగాక దేశంలో అత్యుత్తమ డ్రైవర్లలో మూడో స్థానం కూడా పొందాడు అజిత్.

►ALSO READ | HIT3: టికెట్స్ బుక్ చేసుకునేరు జాగ్రత్త.. ‘హిట్ 3’ ఎవరు చూడాలి.. ఎవరు చూడకూడదు?

ఇటీవల జరిగిన దుబాయ్ 24H 2025 కార్ రేసులో అతను తన రేసింగ్ కెరీర్‌లో బలమైన రీ ఎంట్రీ ఇచ్చాడు. అతని జట్టు, బాస్ కోటెన్ ద్వారా అజిత్ కుమార్ రేసింగ్, 991 విభాగంలో మూడవ స్థానంలో నిలిచింది. దాంతో GT4 క్లాస్ లో ప్రతిష్టాత్మకమైన స్పిరిట్ ఆఫ్ ది రేస్ అవార్డును కూడా అజిత్ గెలుచుకున్నాడుఈ క్రమంలో నేడు అజిత్ బర్త్ డే స్పెషల్గా ఆయన కారు మరియు బైక్ కలెక్షన్‌ వివరాలపై ఓ లుక్కేద్దాం.

అజిత్ అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు, బైక్ కలెక్షన్స్:

1. పోర్స్చే GT3 RS:

అజిత్ స్పోర్ట్స్ కార్ల పట్ల మంచి పట్టు కలిగి ఉన్నాడు. పలు నివేదికల ప్రకారం, అతను 2024లో రూ.3.15 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన పోర్స్చే GT3 RSతో సహా అతని గ్యారేజీలో అనేక విలాసవంతమైన రేసింగ్ కార్లు ఉన్నట్లు సమాచారం. ఈ పోర్స్చే GT3 RS కారు గంటకు 296 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం 3.2 సెకన్లలో 0 నుండి 100 కి.మీ. వేగం చేరుకోగలదు.

2. ఫెరారీ SF90:

అజిత్ వద్ద రూ.9 కోట్ల విలువైన ఫెరారీ SF90 కారు కూడా ఉంది. అతను జూలై 2024లో ఈ కారును కొనుగోలు చేశాడు. ఇది 3990 cc V8 ఇంజిన్‌తో తయారుచేయబడింది. ఇది 7500 rpm వద్ద 769.31 bhp మరియు 6000 rpm వద్ద 800 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

3.మెర్సిడెస్ బెంజ్ 350 GLS:

కేవలం స్పోర్ట్స్ కార్లే కాదు, ఆయనకు ఒక SUV కూడా ఉంది. మెర్సిడెస్-బెంజ్ 350 GLS, అతనికి రూ. 1.35 కోట్లు ఖర్చయింది. ఇది 2987 cc V6 డీజిల్ ఇంజిన్‌తో శక్తినిస్తుంది మరియు 3400 rpm వద్ద 255 bhp మరియు 1600 rpm వద్ద 620 Nm టార్క్‌ను అందిస్తుంది.

4. BMW 740 Li:

నటుడు అజిత్ విలాసవంతమైన BMW 740 Li కారును కూడా కలిగి ఉన్నాడు. ఈ సూపర్‌కార్ ధర సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా. ఇది 2998 cc ట్విన్‌పవర్ టర్బో ఇన్‌లైన్ 6-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది.

5. లంబోర్గిని:

అజిత్ గ్యారేజీలో లంబోర్గిని కారు కూడా ఉంది. అయితే, దాని మోడల్ గురించి వివరాలు ఇంకా తెలియలేదు.

ఇవేగాక, అజిత్ తన లగ్జరీ కార్ల కలెక్షన్‌తో పాటు, సూపర్‌బైక్‌ల పట్ల కూడా వీపరీతమైన పిచ్చి ఉంది. BMW K 1300 S, కవాసకి నింజా ZX-145, BMW S 1000 RR మరియు అప్రిలియా కాపోనార్డ్ 1200 వంటి అనేక ఖరీదైన రేసింగ్ బైక్స్ కలిగి ఉన్నాడు.