
హీరో నాని, శ్రీనిథి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘హిట్ : ది థర్డ్ కేస్’. ఈ మూవీ నేడు గురువారం (2025 మే1న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి నానికి చెందిన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు.
హీరోగా, నిర్మాతగా వరుస విజయాలతో సక్సెస్ రేట్లో ఉన్న నాని మరోసారి సక్సెస్ అయ్యాడా..? హిట్3తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడా? హిట్ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన మూడో కేసు ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంనేది పూర్తి రివ్యూలో చూద్దాం.
కథేంటంటే:
హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం (HIT)లో ఎస్పీ హోదా ఆఫీసర్ అర్జున్ సర్కార్ (నాని). కాశ్మీర్ నుండి ట్రాన్స్ ఫర్పై విశాఖపట్నం వచ్చిన అర్జున్.. వచ్చి రావడంతోనే రెండు దారుణ హత్యలు చేస్తాడు. అతను చేసిన ఈ రెండు హత్యలు గతంలో తాను పని చేసిన కాశ్మీర్ లోని సైకో పాత్ మర్డర్స్ తరహాలో ఉంటాయి. దేశంలోని 13 చోట్ల ఇదే తరహా సైకో మర్డర్స్ జరుగుతుంటాయి. ఈ హత్యల వెనుక కాప్చర్ టార్చర్ కిల్ (సి.టి.కె.) అనే డార్క్ వెబ్ సైట్ ఉందని తెలుస్తుంది. సి.టి.కె. కు అర్జున్ సర్కార్కు సంబంధం ఏమిటి.. అతను ఎందుకు మర్డర్స్ చేశాడు.. అతని జీవితంలో మృదుల (శ్రీనిధి శెట్టి) పాత్ర ఏమిటి.. అనేది మిగతా కథ.
విశ్లేషణ:
క్రైమ్ థ్రిల్లర్ జానర్లో వచ్చే సినిమాలకి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉంటారు. అది తెలుగు భాష చిత్రమైన సరే, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో వచ్చిన సరే. ఇంట్రెస్టింగ్ చూస్తూ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్కి ఎంజాయ్ చేసే పిచ్చి ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి వారికి హిట్ 3 చాలా స్పెషల్ అని చెప్పొచ్చు.
హిట్ 3 కథ, అందులోని థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ అంశాలకు ఆడియన్స్ ఫిదా అవ్వొచ్చు. ఎందుకంటే, మన తెలుగులో ఇటువంటి క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలు తక్కువే. అందుకే హిట్ 3 వెరీ స్పెషల్. ఒక థ్రిల్లర్, ఒక కమర్షియల్ మాస్ ఫిల్మ్ కలిస్తే ఎలా ఉంటుందో హిట్ 3 అలా ఉంటుందని మేకర్స్ చెప్పింది నిజమే అయింది.
దేశవ్యాప్తంగా వేర్వేరు చోట్ల ఒకే రకమైన హత్యలు జరగడం.. దాన్ని హీరో చెదిన్చడం కొన్ని సినిమాల్లో చూస్తూ వచ్చాం. కానీ, ఈ హత్యల వెనుక మోటివ్ భిన్నంగా ఉండటంతో ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆసక్తిగా ఉంటుంది.
కథలోకి వెళితే.. డైరెక్టర్ శైలేష్. ఫస్ట్ సీన్ నుంచే ఎక్కడా టైమ్ వేస్ట్ చేయకుండా స్టోరీ రన్ చేశాడు. అర్జున్ సర్కార్ ఇంట్రో నుంచే తన పూర్తి క్యారెక్టరైజేషన్ పక్కాగా ఎస్టిబ్లిష్ చేసాడు శైలేష్. క్రిమినల్స్‌తో ఆయన ఉండే తీరు, కేసు ఇన్వెస్టిగేషన్ లో చూపించే ఇంటెన్సిటీ, ఇలా ఏదీ చూసిన వణుకు తెప్పించే ప్రయత్నం చేశాడు. ఇలా ఫస్టాఫ్లో అర్జున్ సర్కార్ వైజాగ్ రావడం, రెండు హత్యలు చేయడం, అంతకుముందు కాశ్మీర్‌లో ఇలాంటి ఒక కేసు అతని దృష్టికి రావడం వంటి విషయాలను కనెక్టింగ్‌గా రాసుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
►ALSO READ | HIT3: టికెట్స్ బుక్ చేసుకునేరు జాగ్రత్త.. ‘హిట్ 3’ ఎవరు చూడాలి.. ఎవరు చూడకూడదు?
యాక్షన్ క్రైమ్ తో సీరియస్గా కథనం నడుస్తున్న మధ్యలో, ఫాదర్, సన్ సీన్లు గానీ, నాని, శ్రీనిథి మధ్య లవ్ సీన్స్ రాసుకోవడం కాస్త రీ ఫ్రెషింగ్‌గా అనిపిస్తాయి. కానీ, ఫస్టాఫ్ లో కొన్నిచోట్ల కథనం సాగదీస్తున్న ఫీలింగ్ కలగేలా ఉంటాయి. అయినప్పటికీ, థ్రిల్లింగ్ మేకింగ్ తో ఇంటర్వెల్ కి హై ఇవ్వడంతో, సెకండాఫ్ పై దర్శకుడు ఆసక్తి క్రియేట్ చేశాడు. సెకండాఫ్‌లో మితి మీరిన హింస, ఫైట్స్ మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చుతాయి. క్లైమాక్స్‌లోని 20 నిమిషాలు మాత్రం చాలా గ్రిప్పింగ్‌గా, ప్రేక్షకులను థ్రిల్ అయ్యేలా డైరెక్టర్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.
ఎవరెలా చేశారంటే:
నాని కెరీర్‌లోనే మోస్ట్ వయలెంట్ గా నటించాడు. అర్జున్ సర్కార్ అనే పోలీస్ పాత్రతో కొత్త నానిని చూపించాడు. యాక్షన్, డైలాగ్ డెలివరీ, యాటిట్యూడ్ తో నాని అదరగొట్టేశాడు. నాని, శ్రీనిధి శెట్టి కెమిస్ట్రీ స్క్రీన్ పై కొత్త ఫీలింగ్ ఇస్తుంది. శ్రీనిధి శెట్టి తన పాత్రకు న్యాయం చేసింది. కోమలి ప్రసాద్, చైతూ జొన్నలగడ్డ, రావు రమేష్ మిగతా నటీనటులు తమ తమ పాత్రలతో మెప్పించారు.
సాంకేతిక వర్గం:
సాను జాన్ వర్గేసే సినిమాటోగ్రఫీ, కార్తిక శ్రీనివాస్ ఎడిటింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. జమ్మూ కాశ్మీర్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్లేసెస్ లో వచ్చే విజువల్స్ తో సాను జాన్ వర్గేసే ఆకట్టుకునేలా చేశాడు. మిక్కి జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. పాటలు పర్వాలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఇక దర్శకుడు శైలేష్ కొలను తన రైటింగ్ తో తెరను రక్తసిక్తం చేశాడు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసి మెప్పించాడు.