గౌడులు కల్లు అమ్మితే ఆర్ధికంగా ఎదుగుతారని..

గౌడులు కల్లు అమ్మితే ఆర్ధికంగా ఎదుగుతారని..
  • గౌడ కులానికి, వృత్తికి అమోఘమైన చరిత్ర
  • ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా: గౌడ కులానికి, వృత్తికి అమోఘమైన చరిత్ర ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. గౌడులు కల్లు అమ్మితే ఆర్ధికంగా ఎదుగుతారని కాంగ్రెస్ నేతలు హైదరాబాద్లో కల్లు నిషేధించారని ఆయన ఆరోపించారు. సమాజంలో కుల మత అసమానతలు మొదట తొలగించింది గౌడన్నలేనని ఆయన పేర్కొన్నారు. చెట్టు పన్నులు వేసి గౌడన్నలను హింసకు గురిచేసిన రోజుల నుండి గౌడన్నలు రాజులను చేయడం కొరకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ సర్కారు సహకారంతో 400కోట్ల రూపాయలతో సర్ధార్ సర్వాయి పాపన్న ట్రస్ట్ ను ఏర్పాటు చేసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. మునిపల్లి, మణికొండలో ఈ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయన్నారు. ఇందులో నందనం ప్రాజెక్టుకు అధిక నిదులు కేటాయించడం జరిగిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు.