సభకు కేసీఆర్​ వస్తే మజా ఉండేది

సభకు కేసీఆర్​ వస్తే మజా ఉండేది
  •      ఆయన రాకపోవడంతో తల్లిలేని పిల్లల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
  •     చిట్ చాట్​లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంతో సమావేశాల్లో కిక్కు లేదని, ఆయన వస్తే మజాఉండేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేత లేక పోవడంతో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల పరిస్థితి  తల్లిలేని పిల్లల మాదిరిగా అయిందని అన్నారు. శుక్రవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. 

సబితా ఇంద్రారెడ్డి ఇష్యూపై మాట్లాడుతూ.. మహిళ అని క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు పార్టీ మారి ఉండాల్సింది కాదన్నారు. ఒకవేళ పార్టీ మారినా.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉండాల్సిందన్నారు. ప్రతిపక్ష నేత హోదా హరీశ్, కేటీఆర్ లో ఎవరికి ఇచ్చినా బీఆర్ఎస్ ఆగమైతదన్నారు. హరీశ్​రావు వర్కరే.. కానీ ఆయనకు ఎల్వోపీ ఇవ్వరన్నారు. 

తప్పుడు నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్  సభలో లేనప్పుడు ఎవరు ఎన్ని మాట్లాడినా ఉపయోగం లేదన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆయన్ను జాతిపిత అంటూ పొగిడి ఆకాశంలో కూర్చోబెట్టారని, అధికారం పోయినా కేసీఆర్ ఇంకా అదే ఊహల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు.