ప్యాకెట్లో 1 బిస్కెట్ తగ్గింది.. లక్ష రూపాయలు కట్టిన కంపెనీ

ప్యాకెట్లో 1 బిస్కెట్ తగ్గింది.. లక్ష రూపాయలు కట్టిన కంపెనీ

బిస్కెట్ ప్యాకెట్లో ఒక బిస్కెట్ తక్కువగా ఉన్నందుకు కోర్టు కెక్కాడు ఓ వినియోగదారుడు.. ఐటీసీ కంపెనీ కి చెందిన సన్ ఫీస్ట్ బిస్కెట్ ప్యాకెట్ కొనుగోలు  చేయగా.. అందులో ఓ బిస్కెట్ తగ్గింది. దీంతో వినియోగదారుడికి కోపం, అసహనం కలిగాయి. తనకు అన్యాయం జరిగిందని.. న్యాయం చేయాలని వినియోగదారుల ఫోరం కు ఫిర్యాదు చేసి కంపెనీ నుంచి పరిహారం పొందాడు.. వివరాల్లోకి వెళితే.. 

చెన్నైకి చెందిన డిల్లిబాబు అనే వ్యక్తి కుక్కలకు ఆహారంగా  FMCG మేజర్ ITC  సన్ ఫీస్ట్ మేరీ లైట్ బిస్కట్ ప్యాకెట్లను కొనుగోలు చేశారు. అయితే తాను కొన్న బిస్కట్ ప్యాకెట్లో 16 బిస్కట్లు ఉండాల్సింది..కానీ 15 మాత్రమే ఉన్నాయి.. ఒక బిస్కట్ కనిపించలేదు. ఇదేంటని ఐటీసీ స్టోర్ ను సంప్రదించగా సరియైన సమాధానం ఇవ్వలేదు. దీంతో వినియోదారుల కోర్టు ను ఆశ్రయిం చాడు. 

ఐటీసీ రోజుకు 50 లక్షల బిస్కెట్ల ప్యాకెట్లను తయారు చేస్తుందని.. ఒక్కో బిస్కెట్ విలువ 75 పైసలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ లెక్క ప్రకారం.. కంపెనీ వినియోగదారులను ప్రతి రోజు రూ. 29 లక్షలకు మోసం చేస్తుందని తెలిపారు. 

ఈ అస్థిర ఉత్పత్తులపై విచారించిన వినియోగదారుల న్యాయస్థానం.. డిల్లిబాబుకు అన్యాయం జరిగిందని.. లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని ఐటీసీ కంపెనీని ఆదేశించింది.