
- పంద్రాగస్టు రోజు బిడ్డ పుట్టడడంతో దంపతుల ఆనందం
భద్రాచలం, వెలుగు : భద్రాచలం ఐటీడీఏ పీవో రాహల్ భార్య ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డ జన్మనిచ్చారు. దీంతో పంద్రాగస్టు రోజు పుట్టడడంతో ఐఏఎస్ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. పీవో రాహుల్భార్య మనీషాకు గురువారం రాత్రి పురిటినొప్పులు రావడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. సాధారణ కాన్పు సాధ్యం కాకపోవడంతో డాక్టర్లు శుక్రవారం తెల్లవారుజామున 3.16 గంటల సమయంలో సిజేరియన్చేశారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కల్పించేందుకు పీవో రాహుల్ ప్రయత్నాన్ని పలువురు అభినందించారు.