
భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని హెవీ వెహికల్ ఫ్యాక్టరీ(హెచ్వీఎఫ్) 1850 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 18.
- పోస్టుల సంఖ్య: 1850
- ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి బ్లాక్ స్మిత్, ఫౌండరీ, ఫౌండరీ మ్యాన్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పవర్ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రోప్లాటర్, ఫిట్టర్ జనరల్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెషినిస్ట్, కేర్ ఆపరేషన్స్‌లో ఎన్సీవీటీ నుంచి నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి. 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 60 శాతం, ఓబీసీలకు 62 శాతంతో పాసై ఉండాలి.
- వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 35 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- అప్లికేషన్లు ప్రారంభం: జూన్ 28.
- లాస్ట్ డేట్: జులై 19.
- అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.300.
- సెలెక్షన్ ప్రాసెస్: ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- శాలరీ: మినిమమ్ బేసిక్ పే 21 వేల రూపాయలు.. ఇండస్ట్రియల్ డియరెన్స్ అలవెన్స్.. బేసిక్ పేపై 5 శాతం స్పెషల్ అలవెన్స్.. బేసిక్ పేపై 3 శాతం వార్షిక ఇంక్రిమెంట్