- జులై 31 వరకు ఫైల్ చేయొచ్చు
ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును ప్రభుత్వం పొడిగించింది. 2018–19, 2019–20 ఫైనాన్షియల్ ఇయర్స్ కు సంబంధించి డెడ్‌లైన్ ను జులై 31 వరకు పెంచింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) బుధవారం ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది. 2018–19 ఏడాదికి గాను రివైజ్డ్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి డెడ్‌లైన్ ఈ నెలాఖరుతో ముగియనుండగా.. దాన్ని జులై 31 కి పెంచింది. టాక్స్ ఆడిట్ రిపోర్ట్ అందజేయడానికి గడువును అక్టోబర్ 31కి పెంచింది. 2019–20 ఫైనాన్షియల్ ఇయర్‌కు గాను వివిధ డిడక్షన్లు క్లెయిమ్ కు ఇన్వెస్ట్మెంట్ డెడ్‌లైన్‌ను కూడా సెప్టెంబర్ 30 దాకా పెంచింది. మరోవైపు, పాన్ కార్డును ఆధార్‌కార్డుతో లింక్ చేసుకునేందుకు ఇప్పుడున్న గడువును వచ్చే ఏడాది మార్చి 31 దాకా పొడిగిస్తున్నట్లు సీబీడీటీ తెలిపింది.