
డోనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడైతే, తాను వైట్ హౌస్ నుండి వెళ్లిపోతానని ఆయన కూతురు, సలహాదారు ఇవాంక ట్రంప్ సూచించారు. తన తండ్రి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2020 అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి ఎన్నికైనట్లయితే తాను వైట్ హౌస్ నుండి నిష్క్రమించే అవకాశాలున్నాయని ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ అన్నారు.
రాబోయే అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ మళ్లీ గెలిస్తే మీరు అమెరికా పరిపాలనలో కొనసాగుతారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ‘నాకు నా పిల్లలు మరియు వారి ఆనందం ముఖ్యం, వారికి నేను నా ప్రేమను పంచాలంటే రాజకీయాలను వదిలేయాలి. నా నిర్ణయాలు ఎప్పుడూ నా పిల్లల అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. నేను గత రెండు సంవత్సరాలుగా ఈ దేశం కోసం పనిచేస్తున్నాను. నేను ఈ దేశంలోని ప్రతి రాష్ట్రానికి వెళ్ళాను. అక్కడ ఎంతోమందిని కలిశాను. నేను దేశం కోసమే వైట్ హౌస్ పరిపాలనలోకి వచ్చాను. నేను నా పని పట్ల సంతృప్తిగా లేను. మేము ఈ దేశం కోసం చాలా చేశాం, కానీ అది సరిపోదు, ఇంకా చేయాలి’ అని ఇవాంక చెప్పారు.
2020 ఎన్నికల్లో మళ్లీ పోటీచేయడానికి ఆసక్తిగా ఉన్నారా అని అడిగితే.. ‘నిజాయితీగా చెప్తున్నాను, నాకు రాజకీయాల పట్ల అసలు ఏమాత్రం ఆసక్తిలేదు’ అని వైట్ హౌస్ సలహాదారు ఇవాంక ట్రంప్ అన్నారు. ఇవాంకా మరియు ఆమె భర్త జారెడ్ కుష్నర్ ఇద్దరూ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ 2017 నుండి ట్రంప్ పరిపాలనలో పనిచేస్తున్నారు.
For More News..