మళ్లీ మెరిసిన నెలవంక

మళ్లీ మెరిసిన నెలవంక

ఇవాంకా ట్రంప్..డొనాల్డ్ ట్రంప్ టూర్ లో వెరీ వెరీ స్పెషల్. 2017 హైదరాబాద్ సమ్మిట్ లో మెరిసిన ఈ నెలవంక..మరోసారి తన ఛరిష్మాతో మెస్మరైజ్ చేసింది. ఈసారి తండ్రితో పాటు భారత్ వచ్చింది ఇవాంకా. డొనాల్డ్ ట్రంప్ అండ్ మెలానియా కంటే…అందరీ చూపు ఇవాంకా మీదే. ట్రంప్ కంటే ముందే.. ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి…ఆకాశం నుంచి భూమిపైకి దిగింది నెలవంక. తన భర్త కుష్నర్ తో పాటు అహ్మదాబాద్ లో అడుగుపెట్టింది. ఎయిర్ పోర్ట్ లోనే తనదైన స్టైల్లో ఆకట్టుకుంది ట్రంప్ ముద్దుల కూతురు.

మొతేరా స్టేడియంలో ఇవాంకా..నినాదాల మోత మోగింది.  ఆమె స్టేడియంలో అడుగుపెట్టిందో లేదో..ఒక్కసారిగా హంగామా షురూ అయింది. ఇవాంకా ఇవాంకా నామస్మరణతో స్టేడియం మారుమోగింది. స్టేడియంలోకి అడుగుపెట్టిన ఇవాంకాను ప్రజలు చుట్టుముట్టారు. సెల్ఫీ ప్లీజ్ అంటూ ఇవాంకాతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. వాళ్ల ఇష్టన్ని కాదనకుండా అందరికీ సెల్ఫీలిచ్చింది. స్టేడియంలో ఉల్లాసంగా కనిపించిన ఇవాంకా.. మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చింది. నమస్తే ట్రంప్ ఎలా ఉంది అంటే స్పెక్టాక్యులర్ అంటూ రిప్లై ఇచ్చింది.

ఆగ్రా టూర్ లో ఇవాంకా.. కెమెరాలన్నింటినీ తనవైపు తిప్పుకంది. తాజ్ మహల్ దగ్గర తన భర్తతో కలిసి సందడి చేసింది. తాజ్ మహల్ దగ్గర తన చిరునవ్వుతో మెరుపులు మెరిపించింది ఇవాంకా. ప్రేమ సామ్రాజ్యంలో ఇవాంకా, కుష్నర్ మెస్మరైజ్ చేశారు. ఎంతైన వీళ్లుకూడ ప్రేమ పక్షులే కదా..తమ ప్రేమను మరోసారి పంచుకున్నారు. చేతిలో చేయి వేసుకొని..నవ్వులు పూయించింది ఈ జంట. జంటగానే కాదు ఒంటిరిగానూ మెరిసింది నెలవంక.  తాజ్ అందాలు చూసి ఫిదా అయిపోయింది ఇవాంకా. భర్త  కుష్నర్ తో కలిసి..తాజ్ పరిసరాల్లో కలియతిరిగారు. అద్భుత కట్టడం సౌందర్యం చూస్తూ మైమరచిపోయారు.

తాజ్ మహల్ సౌందార్యాన్ని..తన పర్సనల్ కెమెరాలో  బంధించింది ఇవాంకా. అంతేకాదు..అధికారులు, సెక్యూరిటీ సిబ్బందితోనూ పోటోలు దిగి వాళ్లను ఖుషీ చేసింది ఈ బ్యూటీ. తను చూసిన తాజ్ అందాల్ని..సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది ఇవాంకా. తాజ్ మహల్ వైభవం, సౌందర్యం తనను మురిపించాయని కామెంట్స్ ట్వీట్ చేసింది.  తాజ్ మహల్ దగ్గర ఇవాంకా అందాన్ని చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. నెటిజన్లైతే నెట్టింట్లో రచ్చ చేస్తున్నారు. వాహ్ తాజ్…వాహ్ ఇవాంకా అంటూ కామెంట్స్ పెట్టేస్తున్నారు.