ఈహెచ్​ఎస్​పై ఉత్తర్వులు ఇవ్వండి.. సర్కారుకు ఉద్యోగ సంఘాల జేఏసీ వినతి

ఈహెచ్​ఎస్​పై ఉత్తర్వులు ఇవ్వండి.. సర్కారుకు ఉద్యోగ సంఘాల జేఏసీ వినతి

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. మంగళవారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్ లో టీఎన్జీవో, టీజీవో, గ్రూప్ 1, రెవెన్యూ, టీచర్లతో పాటు 40 సంఘాలు సమావేశమై పలు తీర్మానాలు చేశాయి.  ఈ కార్యక్రమంలో టీఎన్జీవో అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, గ్రూప్ 1 అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గౌడ్, ఇంటర్ జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, రెవెన్యూ అసోసియేషన్ నేత వంగ రవీందర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. సీపీఎస్​ను రద్దు చేయాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, ఉద్యోగులకు సంబంధించిన ఈహెచ్ ఎస్ పై వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని నేతలు కోరారు. ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్లు, మెడికల్ పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలన్నారు.