సీఎం కేసీఆర్ ఎంత బెదిరించినా..బెదిరేదిలేదు : జేఏసీ

సీఎం కేసీఆర్ ఎంత బెదిరించినా..బెదిరేదిలేదు : జేఏసీ

సీఎం కేసీఆర్ ఎంత బెదిరించినా ఒక్క కార్మికుడు కూడా డ్యూటీలో చేరలేదన్నారు జేఏసీ నేతలు. ఎన్నికల కోసం రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. బీజేపీ కార్యాలయంలో లక్ష్మణ్ ను కలిసి……సమ్మె, భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. కార్మికుల సమస్య పరిష్కారం అయ్యే వరకు అండగా ఉంటామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. మరోవైపు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కూడా కలిశారు జేఏసీ నాయకులు. కార్మికులు, సంస్థ పట్ల ప్రభుత్వం అన్యాయంగా ప్రవర్తిస్తోందని.. ఈ విషయంలో కేంద్రం కలగజేసుకోవాలని కిషన్ రెడ్డిని కోరారు. ప్రధాని, రాష్ట్రపతితో సమావేశం ఏర్పాటు చేయిస్తామని కిషన్ రెడ్డి మాటిచ్చారన్నారు జేఏసీ నేతలు.