స‌‌‌‌మ‌‌‌‌స్యలను ప‌‌‌‌రిష్కరించండి.. మంత్రి ఎర్రబెల్లిని కోరిన జీపీ కార్మికుల జేఏసీ

స‌‌‌‌మ‌‌‌‌స్యలను ప‌‌‌‌రిష్కరించండి..  మంత్రి ఎర్రబెల్లిని కోరిన జీపీ కార్మికుల జేఏసీ


హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం జేఏసీ నేతలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కోరారు. సోమవారం మినిస్టర్ క్వార్టర్స్ లో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ నేతలతో మంత్రి రెండో సారి చర్చలు జరిపారు. గతంలో ఓ సారి చర్చలు జరపగా మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో సమ్మె కొనసాగించారు. సమ్మె విరమిస్తే సమస్యలు పరిష్కారిస్తామని తాజాగా మంత్రి హామీ ఇచ్చారు. సీఎం కూడా సమస్యలు పరిష్కరించేందుకు సానుకూలంగా ఉన్నారని చెప్పారు.

 జేఏసీలో ఉన్న యూనియన్లతో చర్చించి నిర్ణయాన్ని మంగళవారం మధ్యాహ్నం వెల్లడిస్తామని మంత్రికి జేఏసీ చైర్మన్ పాలడుగు భాస్కర్, జనరల్ సెక్రటరీ యజ్ఞ నారాయణ తెలిపారు. కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, రెగ్యులర్ చేయాలని మంత్రిని కోరినట్లు జేఏసీ లీడర్లు చెప్పారు. మల్టీ పర్పస్ జీవో ను రద్దు చేయాలని కోరారు. 44 వేల మంది గ్రామ పంచాయతీ కార్మికులు, ఉద్యోగులు పోయిన నెల 6 నుంచి సమ్మె చేస్తున్నారు. 15 డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నారు. కాగా, పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ఆదివారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించారు.