అక్టోబర్ 18న బంద్కు మాల సంఘాల జేఏసీ సంపూర్ణ మద్దతు

అక్టోబర్ 18న బంద్కు మాల సంఘాల జేఏసీ సంపూర్ణ మద్దతు

ట్యాంక్ బండ్, వెలుగు: బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని కోరుతూ తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్ కు మాల సంఘాల జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గురువారం హైదరాబాద్ లోని మాల సంఘాల జేఏసీ ఆఫీసులో బీసీ సంఘాల జేఏసీ సమావేశం జరగ్గా మాల సంఘాల జేఏసీ హాజరై మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ మందాల భాస్కర్, గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్ మాట్లాడారు.

 జనాభా దామాషా ప్రకారం వాటా అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. సరైన వాటా ఇవ్వకుండా సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే లబ్ధిదారులకు ఎలా చేరుతాయని ప్రశ్నించారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించినప్పుడే అట్టడుగు స్థాయి నుంచి విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రాణిస్తారని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరి మార్చుకోవాలని సూచించారు.