మేం చస్తున్నా పట్టించుకోరా?

మేం చస్తున్నా పట్టించుకోరా?
  •  హెల్త్​స్టాఫ్​కు కేంద్రం ఇచ్చినట్లే రాష్ట్రం రూ. 50 లక్షల ఎక్స్​గ్రేషియా ఇవ్వాలి
  •   మరణించిన స్టాఫ్​ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి
  •   ఫ్యామిలీల్లో అందరికీ వెంటనే వ్యాక్సిన్​ అందించాలని డిమాండ్​
  •   20 సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పాటు
  •   సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం తప్పదని హెచ్చరిక

కరోనా బారిన పడి మృతి చెందిన హెల్త్​ స్టాఫ్​కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లే  రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ. 50 లక్షల ఎక్స్​గ్రేషియా  ఇవ్వాలని వైద్య, ఆరోగ్య సంఘాల జేఏసీ డిమాండ్​ చేసింది. ప్రాణాలకు తెగించి డాక్టర్లు, హెల్త్​ సిబ్బంది పనిచేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం పదిరోజుల్లో సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్​ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు శనివారం జేఏసీ ప్రతినిధులు డీహెచ్​ శ్రీనివాసరావును కలసి వినతిపత్రం అందజేశారు.

హైదరాబాద్​, వెలుగు: కరోనా బారిన పడి మృతి చెందిన హెల్త్​ స్టాఫ్​కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లే  రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ. 50 లక్షల ఎక్స్​గ్రేషియా  ఇవ్వాలని వైద్య, ఆరోగ్య సంఘాల జేఏసీ డిమాండ్​ చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎంతమంది హెల్త్​ స్టాఫ్ మరణించారన్న లెక్కలు కూడా ప్రభుత్వం వద్ద లేవని, ప్రాణాలకు తెగించి డాక్టర్లు, హెల్త్​ సిబ్బంది పనిచేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ బతుకులకు భరోసా  కల్పించాలని, అలా కల్పిస్తే కరోనా ఎన్ని వేవ్​లు వచ్చినా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని, వారం పదిరోజుల్లో తమ సమస్యలను పరిష్కరించాలని,  లేకపోతే త్వరలో భవిష్యత్​ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించింది. హెల్త్ స్టాఫ్ పడుతున్న ఇబ్బందులపై  ప్రభుత్వానికి ఎన్ని సార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేకపోవడంతో 20 వైద్య, ఆరోగ్య సంఘాలు శనివారం జేఏసీగా ఏర్పడ్డాయి. సమస్యల పరిష్కారానికి కలిసి పోరాటం చేస్తామని జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు కోఠిలోని డైరక్టర్​ ఆఫ్ హెల్త్​ ఆఫీసు వద్ద నిరసన తెలిపి.. డీహెచ్ శ్రీనివాసరావు కు వినతిపతం అందజేశారు.

24 గంటలూ ఎట్ల పనిచేస్తం: డాక్టర్​ రవిశంకర్​
రాష్ట్రంలో 50 మందికిపైగా వైద్యసిబ్బంది చనిపోయారని, వారి కుటుంబానికి ఎక్స్​గ్రేషియా కేంద్రం ఇచ్చే రూ. 50 లక్షలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ. 50 లక్షలు ఇవ్వాలని వైద్య ఆరోగ్య సంఘాల జేఏసీ ప్రతినిధి డాక్టర్ రవిశంకర్  డిమాండ్​ చేశారు. అదే విధంగా వారి ఇంట్లో ఒకరికి అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. హెల్త్​ స్టాఫ్ ఫ్యామిలీ మెంబర్స్​ అందరికీ వ్యాక్సిన్​ అందించాలని డిమాండ్​ చేశారు. కంటిన్యూగా డ్యూటీలు చేయడంతో డాక్టర్లపై పని ఒత్తిడి పెరుగుతోందని, వర్క్​ ప్రెజర్​ తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. తాము కూడా మనుషులమేనని, 24 గంటలు పనిచేయడం సాధ్యం కాదని, షిఫ్ట్ ల వారీగా డ్యూటీలు చేయించాలని కోరారు. 2017 టీఎస్​పీఎస్సీ ద్వారా కొంత మంది డాక్టర్ల రిక్రూట్ మెంట్​ జరిగిందని, అయితే పలు కారణలతో భర్తీ నిలిచిపోయిందని,  ఆ రిక్రూట్​ మెంట్​ జరిపితే ప్రస్తుతం కొంతవరకు పనిభారం తగ్గుంతుందన్నారు. తమ సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం ముందుకురావాలని ఆయన డిమాండ్​ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వైద్యారోగ్య శాఖను కూడా సీఎం కేసీఆర్ కేసీఆర్​ చూస్తుండటంతో ఆయనను కలిసేందుకు వీలులేకపోవడంతో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​ను కలిశామని, తమ సమస్యలను పరిష్కరించేలా సీఎంకు చెప్పాలని కోరినట్లు వివరించారు.  సమస్యలు పరిష్కరిస్తే కరోనా ఎన్ని  వేవ్​లు వచ్చినా తాము పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే త్వరలో భవిష్యత్​ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.

డాక్టర్లను పట్టించుకోరా?: డాక్టర్​ జనార్దన్​రెడ్డి
కరోనాపై యుద్ధం చేస్తూ ప్రజలను కాపాడుతున్న డాక్టర్లను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తెలంగాణ పబ్లిక్​ హెల్త్​ డాక్టర్స్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ డాక్టర్​ కత్తి జనార్దన్​రెడ్డి  ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్లు, హెల్త్​ స్టాఫ్​ కరోనా బారినపడి లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తోందని,  అన్ని హాస్పిటళ్లలో క్యాష్ లెస్​ ట్రీట్​మెంట్​ అందించాలని, నిమ్స్​లో ప్రత్యేక బ్లాక్​ ఏర్పాటు చేసి హెల్త్​ స్టాఫ్ అందరికీ  ట్రీట్​ మెంట్​ అందించాలని  డిమాండ్​ చేశారు. ఇన్సెంటివ్స్​ గతేడాది ఏప్రిల్​, మే రెండు నెలలు మాత్రమే ఇచ్చారని, ఆ తర్వాత ఇన్సెంటివ్స్​ ఇవ్వడంలేదన్నారు. బేసిక్​ శాలరీలో 30 శాతం ఇన్సెంటివ్స్​ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

పోస్టింగ్​లు ఎందుకు ఇవ్వడం లేదు: సుజాత
​24 గంటలూ డ్యూటీ చేస్తూ నర్సులు ఒత్తిడికి గురవుతున్నారని రాష్ట్ర నర్సెస్​ అసోసియేష్​ ప్రెసిడెంట్ సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. 2017 స్టాఫ్ నర్సెస్​ రిక్రూట్ మెంట్​జరిగి రిజల్ట్స్​ కూడా వచ్చినప్పటికీ నేటికి పోస్టింగ్​లు  ఇవ్వడంలేదని, ఈఎన్ టీ లో బ్లాక్​ ఫంగస్​ కేసులు పెరుగుతున్నప్పటికీ స్టాఫ్​ను  పెంచడంలేదని, దీంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పడుతోందన్నారు.