
- పార్టీని మోసగించినవారిని కాంగ్రెస్‌లోకి తీసుకోం
- తిరిగి వస్తానంటే జిల్లాలోని ఏ ఎమ్మెల్యే ఒప్పుకోరు
మహబూబ్‌నగర్, వెలుగు: “పార్టీని మోసగించినవారిని తిరిగి తీసుకోం. ఇప్పటి వరకు పాలమూరులో ఫ్యాక్షన్రాజకీయాలు లేవు. ఆయన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసు. సర్పంచ్పదవి కోసం సొంత తమ్ముడిని చంపినవాళ్లు రాజకీయాల్లో ఉంటే.. రేపు ఎమ్మెల్యే పదవి కోసం నన్ను కూడా చంపొచ్చు. ఇందుకు నేను జెడ్‌కేటగిరి సెక్యూరిటీ కావాలని సీఎం, పీసీసీ చీఫ్‌ను అడగాలా..! అంటూ జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
బీసీ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే త్వరలో కాంగ్రెస్‌లో చేరుతున్నారనే వార్తలు వినిపిస్తుండడంతో ఒక్కసారిగా జడ్చర్లలో రాజకీయం వేడెక్కింది. దీంతో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సోమవారం ప్రెస్ మీట్ నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి మోసం చేసినవారిని, ప్రతిపక్ష పార్టీల నుంచి సంచులు తీసుకున్న వారికి కాంగ్రెస్‌లో చోటు లేదు. మమ్మల్ని ఓడగొట్టేందుకు ప్రయత్నించినా ఆయన తిరిగి పార్టీలోకి వస్తానంటే తీసుకునే ప్రసక్తే లేదు. ఇందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఏ ఎమ్మెల్యే ఒప్పుకోరు. కాంగ్రెస్‌లో చేరేందుకు పోతే ఆయనకు అపాయింట్కూడా దొరకలేదు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.