జడ్చర్ల టౌన్, వెలుగు: రైతుల సంక్షేమం, సహకార సంఘాల బలోపేతం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అనిరుధ్ రెడ్డి తెలిపారు. కొంతమంది నాయకులు స్వార్థ రాజకీయాల కోసం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.
శనివారం జడ్చర్ల మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ... జడ్చర్ల మార్కెట్ యార్డులో మక్కల కొనుగోలు విషయంలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి చెందిన ఓ వ్యక్తి అనవసర రాజకీయాలు చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఘటనపై చర్యలు తీసుకుంటూ మార్కెట్‌లో విధులు నిర్వహిస్తున్న వ్యక్తిని వెంటనే సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.
