ఉదండాపూర్ నిర్వాసితులకు న్యాయం చేస్తాం: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

ఉదండాపూర్ నిర్వాసితులకు న్యాయం చేస్తాం: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

మహబూబ్ నగర్ కలెక్టరేట్/మహబూబ్ నగర్ టౌన్, వెలుగు:  ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణం వల్ల భూములు కోల్పోయిన రైతులందరికీ మానవతా దృక్పథంతో పూర్తి న్యాయం చేస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి భరోసా ఇచ్చారు. బుధవారం మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడుతో కలిసి ఆయన నిర్వాసిత రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే 90 నుంచి 95 శాతం కుటుంబాలకు పరిహారం, పునరావాస ప్యాకేజీలు అందించామని, కోర్టు కేసులు, ఇతర సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన మిగిలిన అర్హుల సమస్యలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సరైన న్యాయం జరగలేదన్న రైతుల విజ్ఞప్తిపై స్పందిస్తూ, పెండింగ్ పరిహారాల విడుదలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రానున్న ఏడాదిన్నర కాలంలో రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌లో నీటిని నిల్వ చేసే లక్ష్యంతో పనులు స్పీడప్​ చేస్తున్నామని, ప్రాజెక్టు పూర్తికి రైతులు, జిల్లా యంత్రాంగం సహకరించాలని కోరారు.

మిడ్జిల్ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి

మిడ్జిల్ మండల సమగ్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, ప్రతి గ్రామానికి అవసరమైన నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. మిడ్జిల్‌‌‌‌‌‌‌‌ను ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం, స్కిల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ సెంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు, మినీ స్టేడియం, వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భూములను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వీటితో పాటు పాత పాఠశాలల రిపేర్లు, కొత్త భవనాలు, పీహెచ్​సీలు, అంతర్గత రహదారులు, డ్రైనేజీలతో పాటు బైరంపల్లి, వెలుగోముల, వల్లభరావుపల్లి తదితర గ్రామాల్లో వంతెనలు, చెక్‌‌‌‌‌‌‌‌డ్యామ్‌‌‌‌‌‌‌‌లు, బీటీ రోడ్ల నిర్మాణానికి తక్షణమే ప్రతిపాదనలు సమర్పించాలని ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ అధికారులకు సూచించారు.