సౌతాఫ్రికాతో..రెండో టెస్ట్‌‌‌‌కు జడేజా, అవేశ్‌‌‌‌ ఖాన్‌‌‌‌

సౌతాఫ్రికాతో..రెండో టెస్ట్‌‌‌‌కు జడేజా, అవేశ్‌‌‌‌ ఖాన్‌‌‌‌

సెంచూరియన్‌‌‌‌: వెన్ను నొప్పితో తొలి టెస్ట్‌‌‌‌కు దూరమైన స్టార్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ రవీంద్ర జడేజా ప్రాక్టీస్‌‌‌‌ మొదలుపెట్టాడు. దీంతో కేప్‌‌‌‌ టౌన్‌‌‌‌లో వచ్చే నెల 3 నుంచి జరిగే రెండో టెస్ట్‌‌‌‌కు అతను అందుబాటులో ఉండనున్నాడు. మార్నింగ్‌‌‌‌ సెషన్‌‌‌‌లో జడ్డూ 30, 40 మీటర్ల దూరం రన్నింగ్‌‌‌‌ చేశాడు. వెన్నులో ఎలాంటి నొప్పి లేకపోవడంతో అతను ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ డ్రిల్స్‌‌‌‌నూ కంప్లీట్‌‌‌‌ చేశాడు. రిజర్వ్‌‌‌‌ పేసర్‌‌‌‌ ముకేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌తో కలిసి బౌలింగ్‌‌‌‌ కూడా ప్రాక్టీస్‌‌‌‌ చేశాడు. 

టీమ్‌‌‌‌ స్త్రెంత్‌‌‌‌ అండ్‌‌‌‌ కండీషనింగ్‌‌‌‌ కోచ్‌‌‌‌ రజినీకాంత్‌‌‌‌ పర్యవేక్షణలో దాదాపు 20 నిమిషాల పాటు బౌలింగ్‌‌‌‌ వేశాడు. మరోవైపు మహ్మద్‌‌‌‌ షమీ ప్లేస్‌‌‌‌లో పేసర్‌‌‌‌ అవేశ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ను టీమ్‌‌‌‌లోకి తీసుకున్నారు. రెండో టెస్ట్‌‌‌‌కు పేస్‌‌‌‌ బలాన్ని మరింత పెంచేందుకు సెలెక్షన్‌‌‌‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అవేశ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ ఇండియా–ఎ టీమ్‌‌‌‌తో పాటు సౌతాఫ్రికాలోనే ఉన్నాడు. మరోవైపు కెరీర్​ చివరి టెస్ట్​ ఆడుతున్న డీన్​ ఎల్గర్​ రెండో మ్యాచ్​లో సౌతాఫ్రికాకు కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. 

టీమిండియాకు జరిమానా

స్లో ఓవర్‌‌‌‌ రేట్‌‌‌‌ కారణంగా టీమిండియాకు జరిమానా పడింది. తొలి టెస్ట్‌‌‌‌లో ఇండియా నిర్ణీత టైమ్‌‌‌‌లో వేయాల్సిన ఓవర్ల కంటే రెండు ఓవర్లు తక్కువగా వేసింది. దీంతో ప్లేయర్ల మ్యాచ్‌‌‌‌ ఫీజులో 10 శాతం కోత విధించిన ఐసీసీ ఓవర్‌‌‌‌కు  ఒక డబ్ల్యూటీసీ పాయింట్‌‌‌‌ చొప్పున రెండు పాయింట్లు తగ్గించింది. ఇప్పటికే వరల్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ టేబుల్‌‌‌‌లో ఐదో ప్లేస్‌‌‌‌కు పడిపోయిన టీమిండియాకు ఇది మైనస్‌‌‌‌గా చెప్పొచ్చు.