IND vs AUS : జడ్డూ అదుర్స్.. ట్రావిస్ హెడ్ వికెట్ పడగొట్టి కొత్త రికార్డు

 IND vs  AUS : జడ్డూ అదుర్స్.. ట్రావిస్ హెడ్ వికెట్ పడగొట్టి కొత్త రికార్డు

ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతోన్న మూడో టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ వికెట్ పడగొట్టిన జడేజా అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా తరుపున 500 వికెట్లు తీసుకున్నాడు. అంతేకాకుంగా భారత్ తరుపున 500 వికెట్లు, 5వేల పరుగులు పూర్తిచేసిన భారత రెండో ఆల్ రౌండర్ గా రికార్డు నెలకొల్పాడు. జడేజా కంటే ముందు కపిల్ దేవ్(9,031 రన్స్, 687 వికెట్లు) ఈ ఘనత సాధించాడు.

టీమిండియా తరుపున కపిల్ దేవ్ 373 మ్యాచుల్లో 9517 పరుగులు చేసి, 687 వికెట్లు తీసుకున్నాడు. జడేజా 298 మ్యాచుల్లో (టెస్టు, వన్డే, టీ20) 5527 పరుగులు చేసి, 503 వికెట్లు తీసుకున్నాడు. విశేషమేంటంటే.. రవీంద్ర జడేజా, కపిల్ దేవ్ మినహా మరే ఇతర భారత ఆల్ రౌండర్ 5000 పరుగులు, 500 వికెట్లు సాధించలేదు.