
భారత క్రికెట్ ఆటగాళ్లు ఉమేష్ యాదవ్, రవీంద్ర జడేజా సోషల్ మీడియాలో అభిమానులతో ఎక్కువగా టచ్‌లో ఉండరు. కానీ, ఒకరికొకరు మాత్రం సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ టచ్‌లోనే ఉంటారు. తాను వెయిట్‌లిఫ్ట్ చేస్తున్న వీడియోను ఉమేష్ యాదవ్ బుధవారం తన ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశాడు. ఆ పోస్టులో “#doyouliftbro” అని ట్యాగ్ చేశాడు. దానికి స్పందించిన జడేజా.. తాను ఎక్కువ సమయం వృథా చేయనంటూ.. అమ్మాయిలు కూడా ఈ బరువును ఎత్తగలరు.. అని రీట్వీట్ చేశాడు. జడేజా ఫన్నీ ట్వీట్‌కి స్పందించిన ఉమేష్.. ‘ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. సినిమా ఇంకా మిగిలిఉంది’ అని రీట్వీట్ చేశాడు. ఉమేష్ ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనకు సిద్ధమవుతున్నాడు. ఈ నెలఖారులో భారత్ న్యూజిలాండ్ పర్యటనకు బయలుదేరుతుంది. ప్రస్తుతం టీంఇండియా, శ్రీలంకతో టీ20 మ్యాచులు ఆడుతుంది. ఈ టీ20 జట్టులో ఉమేష్ పాల్గొనడంలేదు. కాగా.. జడేజా శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆడుతున్నాడు. మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లలో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండో మ్యాచ్ భారత్ గెలుచుకొని సిరీస్ 1-0 ఆధిక్యంలో ఉంది. మూడో మ్యాచ్ పూణేలో శుక్రవారం జరగనుంది.