క్రికెటర్ జడేజా భార్య రివాబా ఘన విజయం

క్రికెటర్ జడేజా భార్య రివాబా ఘన విజయం

జామ్ నగర్ నుంచి పోటీ చేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా ఘన విజయం సాధించారు. గుజరాత్ ను మోడల్ గా తీర్చిదిద్దిన ఘనత బీజేపీదేన్నారు ఆమె. ఇది కేవలం తన విజయం మాత్రమే కాదన్న రివాబా... ప్రజా విజయం అన్నారు. తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.దీంతో ఆమె జామ్ నగర్ లో భారీ రోడ్ షో నిర్వహించారు.తన భర్త జడేజాతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు.  

ఇక గుజరాత్ ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ఘట్లోడియా నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆమ్నీ యాగ్నిక్ పై 81వేల ఓట్లకుపైగా మెజారిటీతో గెలిచారు. పటిదార్ ఉద్యమకారుడు హార్థిక్ పటేల్ కూడా మెజారిటీ విజయం సాధించారు. గుజరాత్ ఆప్ సీఎం క్యాడిడేట్.. ఇసుదాస్ గఢ్వీ ఘోర ఓటమిని చవిచూశాడు.ఖంబాలియా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. బీజేపీ అభ్యర్థి ములుభాయ్ బేరా చేతిలో పరాజయాన్ని చవి చూశారు.