కామన్వెల్త్‌‌ బాక్సింగ్లో ప్రిక్వార్టర్స్‌‌లోకి.. జాదుమణి సింగ్‌

 కామన్వెల్త్‌‌ బాక్సింగ్లో ప్రిక్వార్టర్స్‌‌లోకి..  జాదుమణి సింగ్‌

ఇండియా బాక్సర్‌‌ జాదుమణి సింగ్‌‌.. కామన్వెల్త్‌‌ బాక్సింగ్‌‌లో ప్రిక్వార్టర్స్‌‌లోకి ప్రవేశించాడు. మెన్స్‌‌ 55 కేజీల కేటగిరీలో జాదుమణి.. ఆరోన్‌‌ కుల్లెన్‌‌ (స్కాట్లాండ్‌‌)పై ఏకపక్ష విజయం సాధించాడు. పారా స్విమ్మింగ్‌‌లో ఇండియాకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి.  

మెన్స్‌‌ 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌‌ ఎస్‌‌–13లో పారా స్విమ్మింగ్‌‌ ఫైనల్లో కార్తీక్‌‌ బుడిగెల 57.57 సెకన్లలో లక్ష్యాన్ని చేరి నాలుగో ప్లేస్‌‌లో నిలిచి పతకం మిస్సయ్యాడు. ఇమామ్‌‌ అలీ (1:03.73 సెకన్లు) ఏడో ప్లేస్‌‌తో సరిపెట్టుకున్నాడు.

మెన్స్‌‌ 50 మీటర్ల బ్యాక్‌‌ స్ట్రోక్‌‌ సెమీ ఫైనల్లో శ్రీహరి నటరాజ్‌‌ 25.29 సెకన్ల టైమింగ్‌‌తో ఏడో స్థానంలో నిలిచాడు. మెన్స్‌‌ 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌‌ స్విమ్మింగ్‌‌లో తక్షణ్ శశికుమార్‌‌ (3:58.09 సెకన్లు), ఆర్యన్‌‌ నెహ్రా (4:00.26 సెకన్లు) వరుసగా 15, 16వ ప్లేస్‌‌లో నిలిచారు. లాన్‌‌ బౌల్స్‌‌లో రూపారాణి తిర్కీ–పింకి సింగ్‌‌ 2–0 (టైబ్రేక్‌‌)తో టోంగాపై గెలిచారు.