
ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జగజ్యోతి ఉస్మానియా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యింది. జగజ్యోతిని ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. జ్యోతికి ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రీమాండ్ విధించింది. మరోవైపు రిమాండ్ ఆపాలని జ్యోతి తరపు న్యాయవాది కోర్టును కోరారు. జ్యోతిని అరెస్ట్ చేసి 24 గంటలు గడిచిపోయిందని చెప్పారు. కోర్టు అనుమతి తీసుకునే అరెస్టు చేశారని జడ్జి తెలిపారు. మార్చి 6 వరకు రీమాండ్ లో ఉంచాలని ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది.
చంచల్ గూడా మహిళా జైలుకు తరలించాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి ఉస్మానియా మూడు రోజుల క్రితం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. ఆమె ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో జగ జ్యోతి చెస్ట్ పెయిన్ అంటూ ఉస్మానియా ఆస్పత్రిలో చేరింది. రెండు రోజులుగా ఆసుపత్రిలో జ్యోతి ట్రిట్మెంట్ పొందుతుంది. వివిధ టెస్టుల అనంతరం జ్యోతి ఆరోగ్యంగానే ఉందని బుధవారం నాడు ఉస్మానియా వైద్యులు డిశ్చార్జ్ చేశారు.