జీడిమెట్ల, వెలుగు: మానసిక పరిస్థితి సరిగా లేని ఓ మహిళ అదృశ్యమైంది. జగద్గిరిగుట్ట పాపిరెడ్డినగర్ కు చెందిన రాముల సంతోష (50) కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లోంచి ఎక్కడికో వెళ్లిపోయింది. బంధువులు,చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
