కాంగ్రెస్ వస్తేనే అభివృద్ధి :  జగదీశ్వర్ గౌడ్

కాంగ్రెస్ వస్తేనే అభివృద్ధి :  జగదీశ్వర్ గౌడ్

గచ్చిబౌలి, వెలుగు :  శేరిలింగంపల్లి సెగ్మెంట్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. శనివారం సెగ్మెంట్ లోని పలు గేటెడ్ కమ్యూనిటీల్లో ఆయన ఎన్నికల  ప్రచారం నిర్వహించారు.

మైహోం మంగళ, నల్లగండ్లలోని లక్ష్మీ విహార్ ఫేజ్–2లో ఇంటింటికి తిరుగుతూ  ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన చెప్పారు.