
గచ్చిబౌలి, వెలుగు : శేరిలింగంపల్లి సెగ్మెంట్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి వి. జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. శుక్రవారం గచ్చిబౌలి నానక్ రాంగూడలోని క్రీక్ గేటెడ్ కమ్యూనిటీ, ప్రజయ్ సిటీ కమ్యూనిటీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేయాలన్నారు. తనను గెలిపిస్తే శేరిలింగంపల్లిని అన్ని రంగాల్లో డెవలప్ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.