హెచ్‎సీఏ కేసులో జగన్‌‌ మోహన్‌‌రావుకు బెయిల్‌‌

హెచ్‎సీఏ కేసులో జగన్‌‌ మోహన్‌‌రావుకు బెయిల్‌‌

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ (హెచ్‌‌సీఏ)లో ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టయిన  ప్రెసిడెంట్‌‌ జగన్‌‌మోహన్‌‌రావుకు హైకోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష వ్యక్తిగత బాండ్‌‌తో పాటు అంతే మొత్తానికి మరో ఇద్దరి పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది.

 సీఐడీ నమోదు చేసిన కేసులో ఛార్జి షీటు దాఖలు చేసేదాకా లేదంటే 8 వారాలపాటు ప్రతి సోమవారం ఉదయం 11 గంటలకు సంబంధిత దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ కేసులో 18 మంది సాక్షులను ఇప్పటికే విచారించినట్లు దర్యాప్తు అధికారి వెల్లడించారని, 45 రోజులు పోలీసు కస్టడీలో ఉన్న విషయాలను పరిగణనలోకి తీసుకుని షరతులతో బెయిలు మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.