హైదరాబాద్సిటీ, వెలుగు: హరే కృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 19న కోకాపేట్‌లో తొలిసారిగా శ్రీ జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను బుధవారం హైదరాబాద్హరేకృష్ణ మూవ్మెంట్అధ్యక్షుడు సత్య గౌర చంద్ర దాస ప్రభూజీ ఆవిష్కరించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ద ట్రైలైట్, గోల్డెన్ మైల్ లే అవుట్ రోడ్, కోకాపేటలో పూజలు, చీపురుతో రోడ్డును శుద్ధి చేసే కార్యక్రమంతో ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. కోకాపేట్ వీధుల నుంచి సాగుతూ రాజపుష్ప అట్రియా మీదుగా గోల్డెన్ మైల్ రోడ్ వైపు కదులుతూ, చివరికి హరే కృష్ణ హెరిటేజ్ టవర్చేరుకుంటుందన్నారు. దారి పొడవునా అందరికీ రథం లాగే అవకాశం ఉంటుందన్నారు.
