- షీ టీమ్స్‌కు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: ఇంటి వద్దకు వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమో దు చేయడం అనేది మంచి నిర్ణయమని, అయితే ఆడ పిల్ల లు చేసే ఫిర్యాదులను పోలీసులు బహిర్గతం చేయడం సరైంది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. గురు వారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఆడ పిల్లలు నిర్భయంగా పోలీసులకు కంప్లైట్ చేసే అవకాశం ఈ ఇంటి వద్దకే ఫిర్యాదు నిర్ణయంతో దక్కిందన్నారు.
అయితే, ఇదే సమయంలో వారు ఎవరి చేతిలో మోసపోయింది, ఎలా మోసపోయింది, ఆమె ఎవరు వంటి విషయాలను బయటకు చెప్పకుండా చర్యలు తీసుకోవాలని షీ టీమ్ ఇన్‌చార్జి చారుసిన్హాకు విజ్ఞప్తి చేశారు.
