
కోరుట్ల,వెలుగు: ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసి అమ్ముతున్న నిందితుడిని జగిత్యాల జిల్లా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. బుధవారం సీఐ సురేశ్‌బాబు మీడియాకు వివరాలు తెలిపారు. కోరుట్ల టౌన్ ఆదర్శనగర్‌కు చెందిన రుద్ర వేణుగోపాల్(45) స్థానిక పోచమ్మవాడలో మంత్ర ఆన్లైన్సెంటర్ నిర్వహిస్తున్నాడు. రెండేండ్లుగా కంప్యూటర్లో ఫొటో షాప్ ద్వారా టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్ ఫేక్ మెమోలు, బర్త్, డెత్ ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నాడు. అవసరమైనవారి వద్ద రూ. వేలల్లో డబ్బులు తీసుకుని అమ్ముతున్నాడు.
సమాచారం అందడంతో కోరుట్ల పోలీసులు, జగిత్యాల సీసీఎస్ పోలీసులు వెళ్లి మంత్ర ఆన్ లైన్ సెంటర్ పై ఆకస్మిక దాడి చేశారు. నిందితుడు వేణుగోపాల్ ను అదుపులోకి తీసుకున్నారు. 106 ఫేక్ సర్టిఫికెట్లు, కంప్యూటర్, ప్రింటర్, పేపర్ కటింగ్, లామినేషన్ మెషీన్ స్వాధీనం చేసుకున్నారు. కోరుట్ల సీఐ సురేశ్‌బాబు, ఎస్ చిరంజీవి, సీసీఎస్ సీఐ శ్రీనివాస్, సీసీఎస్ఎస్ఐ రాజు, కానిస్టేబుల్స్ ను జిల్లా ఎస్పీ అశోక్కుమార్అభినందించారు.